DANCE: డ్యాన్స పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థినులు
ABN , Publish Date - Sep 14 , 2025 | 01:02 AM
జిల్లాస్థాయి గ్రూపు డ్యాన్స పోటీలలో మండలంలోని దాడితోట ఉన్నతపాఠశాల విద్యా ర్థులు ఉత్తమ ప్రతిభ కనబరచి విజేతలుగా నిలిచారు. వారిని ఉ పాధ్యాయ బృందం శనివారం పాఠశాలలో అభినందించారు. ఈ నెల 11, 12 తేదీలలో ప్రభుత్వ డైట్ కళాశాల మైదానంలో జరిగిన కళా ఉత్సవ్ పోటీలలో విద్యార్థులు బృంద నృత్యంతో సంప్రదాయ నృత్య కళారూపాలను ప్రతిబింబించేలా ప్రతిభ కనబరిచారని హెచఎం ఉమామహేశబాబు తెలిపారు.
తాడిమర్రి, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): జిల్లాస్థాయి గ్రూపు డ్యాన్స పోటీలలో మండలంలోని దాడితోట ఉన్నతపాఠశాల విద్యా ర్థులు ఉత్తమ ప్రతిభ కనబరచి విజేతలుగా నిలిచారు. వారిని ఉ పాధ్యాయ బృందం శనివారం పాఠశాలలో అభినందించారు. ఈ నెల 11, 12 తేదీలలో ప్రభుత్వ డైట్ కళాశాల మైదానంలో జరిగిన కళా ఉత్సవ్ పోటీలలో విద్యార్థులు బృంద నృత్యంతో సంప్రదాయ నృత్య కళారూపాలను ప్రతిబింబించేలా ప్రతిభ కనబరిచారని హెచఎం ఉమామహేశబాబు తెలిపారు. దీంతో వారికి మొదటి స్థానం దక్కిందని, ప్రశంసాపత్రంతో పాటు బహుమతులు అంద జేసినట్టు హెచఎం తెలిపారు. వీరు అక్టోబరు నెలలో విజయ వాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారన్నారు. ఈ సంద ర్భంగా విజేతలుగా నిలిచిన విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయ బృందం అబినందించింది.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....