ROAD: ఆగిన రోడ్డు పనులు ప్రారంభం
ABN , Publish Date - Dec 07 , 2025 | 12:23 AM
మండల పరిధిలోని గొడ్డువెలగల పంచా యతీలో అర్ధాంతరంగా నిలిచిపోయిన రోడ్డు పనులను శనివారం ప్రారంభించారు. తుమ్మల బైలు నుంచి గొడ్డువెలగల పంచాయతీకి గతంలో తారు రోడ్డు వేశారు. గొడ్డు వెలగల సమీపాన అటవీ ప్రాంతంలో అటవీశాఖ అనుమతులు లేకపోవడంతో కొంత వరకు సిమెంట్ రోడ్డు పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి.
గాండ్లపెంట, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని గొడ్డువెలగల పంచా యతీలో అర్ధాంతరంగా నిలిచిపోయిన రోడ్డు పనులను శనివారం ప్రారంభించారు. తుమ్మల బైలు నుంచి గొడ్డువెలగల పంచాయతీకి గతంలో తారు రోడ్డు వేశారు. గొడ్డు వెలగల సమీపాన అటవీ ప్రాంతంలో అటవీశాఖ అనుమతులు లేకపోవడంతో కొంత వరకు సిమెంట్ రోడ్డు పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఎమ్మెల్యే చొరవతో అటవీశాఖ అధికారుల అను మతి తీసుకొని ఎనఆర్‌జీఎస్ పథకం కింద సుమారు రూ. 30లక్షల వ్యయంతో 600 మీటర్లు సిమెంట్ రోడ్డు పనులను ప్రారంభించారు. గతంలో తుమ్మలబైలు, సాదుల వాండ్లపల్లి, పెద్దతండా గ్రామవాసు లు వివిధ పనుల నిమిత్తం గ్రామ సచివాలయానికి రావాలంటే ఎంతో ఇబ్బందులకు గురయ్యేవారు. ప్రస్తుతం రోడ్డు సమస్య తీరి రాకపోకలకు సులభంగా మారుతుందని ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు వేమయ్య కుమార్, కుమారస్వామి, గంగులప్ప, నరసింహులు, వెంకటరమణ, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....