DDO: నూతన అధ్యాయానికి శ్రీకారం
ABN , Publish Date - Dec 05 , 2025 | 12:08 AM
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి విషయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖలలో నూతన అధ్యాయానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని బీజేపీ నియోజకవర్గ ఇనఛార్జ్ హారీష్‌బాబు పేర్కొన్నారు. పరిపాలనా వ్యవస్థ పారదర్శకంగా, వేగంగా, సమయబద్ధంగా మార్చడంలో డీడీఓ కార్యాలయాలు కీలకపాత్ర పోషిస్తాయన్నారు.
కదిరి అర్బన, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): పట్టణంలో డీడీఓ కార్యాలయాన్ని గురువారం ఆ ర్డీఓ వీవీఎస్ శర్మ ప్రారంభించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి పవ న కళ్యాణ్ వర్చ్యువల్‌గా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డీడీఓ వెంకటరత్నం, డీఎస్పీ శ్రీనివాసులు, ఏపీడీ శకుంతల, తహసీ ల్దార్ మురళీకృష్ణ, మున్సిపల్ చైర్‌పర్సన దిల్షాద్‌మున్నీష, మున్సిపల్ కమిషనర్ కిరణ్ కుమార్, ఎఫ్‌ఆర్వో గుర్రప్ప, సీఐలు నారాయణరెడ్డి, నిరంజనరెడ్డి, ఎంపీడీవో పోలప్ప తదితరులు పాల్గొన్నారు.
ధర్మవరంరూరల్: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి విషయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖలలో నూతన అధ్యాయానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని బీజేపీ నియోజకవర్గ ఇనఛార్జ్ హారీష్‌బాబు పేర్కొన్నారు. పరిపాలనా వ్యవస్థ పారదర్శకంగా, వేగంగా, సమయబద్ధంగా మార్చడంలో డీడీఓ కార్యాలయాలు కీలకపాత్ర పోషిస్తాయన్నారు.
పట్టణంలోని రేగాటిపల్లి రైల్వేగేటు సమీపంలో ఉన్న ఉపాధి హామీ ఏపీడీఓ కార్యాలయంలో ధర్మవరం డివిజన పరిధికి సంబంధించి నూతన డీడీఓ కార్యాలయాన్ని హారీష్‌బాబు హాజరై ప్రారంభించారు. ఏపీడీ వెంకటరమణ, ధర్మవరం ఇనచార్జ్ ఎంపీడీఓ అబ్దుల్‌నబీ, డివిజనలోని ఎంపీడీఓలు బాలకృష్ణ, నరసింహనాయుడు, డిప్యూటీ ఎంపీడీఓ వెంకటేష్, పంచాయతీ కార్యదర్శులు, నాయకులు యల్లప్ప, మురళీగౌడ్, అంగజాలరాజు, నందనాయక్, పవనరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....