Share News

COLLECTOR: స్ర్తీనిధి.. డ్వాక్రా మహిళల పెన్నిధి

ABN , Publish Date - Oct 18 , 2025 | 12:25 AM

స్ర్తీనిధి బ్యాంకు.. స్వయం సహాయక సంఘాల మహిళలకు పెన్నిధిలాంటిదని కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం స్ర్తీనిధి ఆంధ్రప్రదేశ పోస్టర్లను డీఆర్‌డీఏ పీడీ నరసయ్యతో కలిసి ఆవిష్కరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. స్ర్తీనిధి ద్వారా 11 శాతం వడ్డీతో ప్రతి మహిళ లక్షరూపాయల వరకు రుణం తీసుకునే వెసులుబాటు ఉందన్నారు.

COLLECTOR: స్ర్తీనిధి.. డ్వాక్రా మహిళల పెన్నిధి
collector unveiling the poster

కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌

పుట్టపర్తి టౌన, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): స్ర్తీనిధి బ్యాంకు.. స్వయం సహాయక సంఘాల మహిళలకు పెన్నిధిలాంటిదని కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం స్ర్తీనిధి ఆంధ్రప్రదేశ పోస్టర్లను డీఆర్‌డీఏ పీడీ నరసయ్యతో కలిసి ఆవిష్కరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. స్ర్తీనిధి ద్వారా 11 శాతం వడ్డీతో ప్రతి మహిళ లక్షరూపాయల వరకు రుణం తీసుకునే వెసులుబాటు ఉందన్నారు. స్ర్తీనిధి సురక్ష రుణ పథకం ద్వారా రుణం తీసుకున్న మహిళలు మరణిస్తే మొత్తం రుణం మాఫీ అవుతుందన్నారు. స్ర్తీనిధి బ్యాంకు ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని 23,411 మంది డ్వాక్రా మహిళలకు రూ.234 కోట్లు రుణాలు అందించడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇప్పటి వరకు 9,903 మందికి రూ.89 కోట్ల రుణాలు మంజూరు చేశామన్నారు. గ్రామీణ ప్రాంత స్వయం సహాయక సంఘాల మహిళలు తమ జీవనోపాధి మెరుగుకోసం స్ర్తీనిధి రుణాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. కార్యక్రమంలో స్ర్తీనిధి బ్యాంకు ఏజీఎం అనిమేష్‌, ఏపీఎం ఓబులేసు పాల్గొన్నారు.

Updated Date - Oct 18 , 2025 | 12:25 AM