FORMER MINISTER: అభివృద్ధిని ఓర్వలేక శ్రీధర్‌రెడ్డి ఆరోపణలు
ABN , Publish Date - Dec 10 , 2025 | 11:55 PM
సత్య సా యి బాబా శతజయంతి ఉత్సవాలను మునుపెన్న డూ లేని విధంగా ఘనం గా నిర్వహించామని, ఈ సందర్భంగా పుట్టపర్లిఓ జ రిగిన అభివృద్దిని చూసి ఓర్వలేకనే వైసీపీ నాయకుడు శ్రీధర్‌రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నా రని మాజీమంత్రి పల్లె రఘనాథరెడ్డి అన్నారు. అభివృద్ధి పనుల్లో అవకతవకలుంటే రాతపూర్వకంగా ఫిర్యాదుచేయాలని, విజిలెన్సుతో విచారణ చేయంచడానికి సిద్దంగా ఉన్నామని శ్రీధర్‌రెడ్డికి సూచించారు.
విజిలెన్సతో విచారణకు సిద్ధం : మాజీ మంత్రి పల్లె
పుట్టపర్తి రూరల్, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): సత్య సా యి బాబా శతజయంతి ఉత్సవాలను మునుపెన్న డూ లేని విధంగా ఘనం గా నిర్వహించామని, ఈ సందర్భంగా పుట్టపర్లిఓ జ రిగిన అభివృద్దిని చూసి ఓర్వలేకనే వైసీపీ నాయకుడు శ్రీధర్‌రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నా రని మాజీమంత్రి పల్లె రఘనాథరెడ్డి అన్నారు. అభివృద్ధి పనుల్లో అవకతవకలుంటే రాతపూర్వకంగా ఫిర్యాదుచేయాలని, విజిలెన్సుతో విచారణ చేయంచడానికి సిద్దంగా ఉన్నామని శ్రీధర్‌రెడ్డికి సూచించారు. ఆయన బుధవారం జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సత్యసాయి శతజయంతి ఉత్స వాల సందర్భంగా పట్టణంలో నిర్మించిన మరుగుదొడ్ల విషయంలో కుంభకోణమంటూ శ్రీధిర్‌రెడ్డి హడావుడి చేస్తున్నారన్నారు.
పుట్టపర్తి అభి వృద్ధిని అడ్డుకోవడమే శ్రీధర్‌రెడ్డి పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత ఆర్టీసీ డిపో, శిశుసంక్షేమ హాస్టళ్లు, పంచాయతీ ఇంజనీ రింగ్ కార్యాలయాలు సగం పట్టణంలోని ఇరిగేషన ల్యాండ్‌లోనే ఎన్నాళ ్లగానో ఉన్నాయనే విషయాన్ని గుర్తించాలన్నారు. ఇరిగేషన ల్యాండ్‌లో కొ త్తగా శాశ్వత నిర్మాణాలను ఎక్కడైనా నిర్మించి ఉంటే చూపాలన్నారు. మున్సిపల్ చైర్మన ఓబుళపతి అభివృద్ధిని కోరుకునే మంచినాయకుడని, ఆయన్ను బెదిరిస్తున్నారని చెప్పడం పూర్తిగా అసత్యమన్నారు. అలాంటి సంస్కృతి మాది కాదని, మేం ప్రజాసేవ మాత్రమే చేస్తామన్నారు. పుట్ట పర్తి ఆభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం ఆపకపోతే ప్రజలే శిక్షిస్తారన్నారు. పుట్టపర్తి ప్రశాంతతను అడ్డుకునే అసాంఘిక శక్తులపై పోలీసులు ఇప్పటికే కఠినంగా వ్యవహరిస్తున్నారన్నారు. పద్ధతి తప్పి మాట్లాడడం, తప్పుదారి పట్టించడం మానుకోవాలని హితవు పలికారు. 2029 ఎన్నికల్లో మీఆడ్రస్ గల్లంతు కావడం ఖాయమన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....