ICDS: తల్లిపాలే బిడ్డకు శ్రీరామరక్ష
ABN , Publish Date - Aug 06 , 2025 | 12:01 AM
తల్లిపాలే బిడ్డకు శ్రీరామ రక్ష అని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ తిప్పేంద్రనాయక్ పేర్కొన్నారు. స్థానిక ఏరియా ప్రభుత్వాస్పత్రిలో మంగళవారం తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా సూపరింటెండెంట్ తిప్పేంద్రనాయక్ తల్లిపాల ప్రాముఖ్యత గురించి వివ రించారు. తల్లిపాలే బిడ్డకు శ్రేష్టమని, బిడ్డల వ్యాదినిరోధక శక్తిపెర గాలంటే తల్లిపాలే ముఖ్యమన్నారు.
(ఆంధ్రజ్యోతి, న్యూస్ నెట్‌వర్క్)
తల్లిపాలే బిడ్డకు శ్రీరామ రక్ష అని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ తిప్పేంద్రనాయక్ పేర్కొన్నారు. స్థానిక ఏరియా ప్రభుత్వాస్పత్రిలో మంగళవారం తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా సూపరింటెండెంట్ తిప్పేంద్రనాయక్ తల్లిపాల ప్రాముఖ్యత గురించి వివ రించారు. తల్లిపాలే బిడ్డకు శ్రేష్టమని, బిడ్డల వ్యాదినిరోధక శక్తిపెర గాలంటే తల్లిపాలే ముఖ్యమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యులు నజీర్, మాధవి, శైలజ, సురేశనాయక్, శ్రావణి, శ్వేత, ప్రియ, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ వాణి తదితరులు పాల్గొన్నారు. అలాగే తాడిమర్రిలో ఐసీడీఎస్ సూపర్‌వైజర్ లలితమ్మ ఆధ్వర్యంలో అంగనవాడీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. అంగనవాడీ సిబ్బంది జయలక్ష్మి, హరిత, అలి వేలమ్మ, నాగలక్ష్మి పాల్గొన్నారు. కదిరి రూరల్ పరిధిలోని మల్లయ్య గారిపల్లిలో ఐసీడీఎస్ సూపర్‌వైజర్ నిహారిక ఆధ్వర్యంలో తల్లిపాల వారో త్సవాల సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. అంగనవాడీ కార్యకర్తలు రామలక్ష్మి, ఆయా, పిల్లలు, తల్లులు, బాలింతలు పాల్గొన్నారు. నంబుల పూలకుంటలో ఐసీడీఎస్ సూపర్‌వైజర్ నరసమ్మ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అంగనవాడీ కార్యకర్తల సావిత్రి, ఆయాల చంద్రకళ, తల్లులు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు. మండలకేంద్రమైన తలుపుల లోని ప్రకాష్‌నగర్ అంగనవాడీ కేంద్రం ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్స వాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీడీపీఓ రాధిక మాట్లాడుతూ బిడ్డకు రెండేళ్లు వయస్సు వచ్చే వరకు అదనపు ఆహారంతో పాటు తల్లిపాలు తాగించాలని సూచించారు. ఈ కార్య క్రమంలో ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు దీప, అలివేలమ్మ, అంగనవాడీ కార్యకర్తలు, ఆయాలు, తల్లులు, పిల్లలు, గర్భిణులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....