Share News

GOD: శ్రీమాత్రే నమః

ABN , Publish Date - Sep 29 , 2025 | 12:02 AM

శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు ఆదివారం ప్రశాంతి నిలయంలోని గాయత్రిమాత, మామిళ్ళకుంట లలితాపరమేశ్వరి సరస్వ తి దేవిగా దర్శమిచ్చారు. జిల్లాకేంద్రంలోని వాసవీ మాత అన్నపూర్ణగా, సత్యమ్మ దేవత, ఎనుమలపల్లి దుర్గాదేవి మహాచండిగా దర్శనమి చ్చారు.

GOD: శ్రీమాత్రే నమః
Kanyakaparameshwari as Varahi Mata in Kadiri

(ఆంధ్రజ్యోతి, న్యూస్‌ నెట్‌వర్క్‌)

శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు ఆదివారం ప్రశాంతి నిలయంలోని గాయత్రిమాత, మామిళ్ళకుంట లలితాపరమేశ్వరి సరస్వ తి దేవిగా దర్శమిచ్చారు. జిల్లాకేంద్రంలోని వాసవీ మాత అన్నపూర్ణగా, సత్యమ్మ దేవత, ఎనుమలపల్లి దుర్గాదేవి మహాచండిగా దర్శనమి చ్చారు. ధర్మవరం పట్టణంలో సూర్యప్రభ వాహనంపై శ్రీనివానగర్‌ వెంకటేశ్వరస్వామి, మధుర మీనాక్షిగా గాంధీనగర్‌ చౌడేశ్వరి భక్తులకు దర్శనమిచ్చారు. కొత్త చెరువులోని పెద్దమ్మను మహాచండిగా, బత్తలప ల్లిలో అమ్మవారిని మహేశ్వరీ దేవిగా అలంకరించారు. గాండ్లపెంట మండలపరిధిలోని కటారుపల్లి గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కదిరి పట్టణంలో కన్యకాపర మేశ్వరి వారాహి మాతగా, కుమ్మరవాండ్లపల్లి మల్లాలమ్మ గజలక్ష్మిగా, చౌడేశ్వరీ దేవి పార్వతీదేవిగా, తనకల్లులో కన్యాకపరమేశ్వరి వెంకటరమణస్వామిగా భక్తులకు దర్శనమిచ్చారు.

Updated Date - Sep 29 , 2025 | 12:02 AM