Share News

COLLECTOR : భూసేకరణను వేగవంతం చేయండి : కలెక్టర్‌

ABN , Publish Date - Aug 08 , 2025 | 12:10 AM

జిల్లాలో సోలార్‌ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం భూసేకరణను వేగవంతం చేయాలని అధికారులను కలెక్టర్‌ చేతన ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోలార్‌ పవర్‌ ప్రాజెక్టులకు భూసేకరణ అంశంపై గురువారం ఆయన జేసీ అభిషేక్‌కుమార్‌తో కలిసి అధికారులతో సమీక్షించారు.

COLLECTOR : భూసేకరణను వేగవంతం చేయండి : కలెక్టర్‌

పుట్టపర్తి టౌన, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): జిల్లాలో సోలార్‌ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం భూసేకరణను వేగవంతం చేయాలని అధికారులను కలెక్టర్‌ చేతన ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోలార్‌ పవర్‌ ప్రాజెక్టులకు భూసేకరణ అంశంపై గురువారం ఆయన జేసీ అభిషేక్‌కుమార్‌తో కలిసి అధికారులతో సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ భూసేకరణ ప్రక్రియలో భాగంగా సంబంధిత గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి, ప్రజల అభిప్రాయం పొందిన తరువాత సమగ్ర నివేదికను సమర్పించాలన్నారు. ఎటువంటి లోటుపాట్లు తలెత్తకుండా పకడ్బందీగా వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ శాఖాధికారులతోపాటు నెట్‌క్యాంప్‌, వివిధ సోలార్‌ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Aug 08 , 2025 | 12:10 AM