GOD: ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు
ABN , Publish Date - Aug 24 , 2025 | 12:53 AM
మండలపరిధిలోని పాలపాటి దిన్నె ఆంజనేయస్వామి ఆలయం శ్రావణమాసం చివరి శనివారం పురస్క రించుకుని భక్తులతో కిటకిటలా డింది. ఈ సందర్భంగా అర్చకులు స్వా మివారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో ఉంచి ఊరేగించారు. ఆలయకమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్తప్ర సాదాలు అందచేశారు.
భక్తులతో కిటకిటలాడిన పాలపాటిదిన్నె ఆలయం
నల్లచెరువు, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): మండలపరిధిలోని పాలపాటి దిన్నె ఆంజనేయస్వామి ఆలయం శ్రావణమాసం చివరి శనివారం పురస్క రించుకుని భక్తులతో కిటకిటలా డింది. ఈ సందర్భంగా అర్చకులు స్వా మివారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో ఉంచి ఊరేగించారు. ఆలయకమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్తప్ర సాదాలు అందచేశారు. ఓరువాయి పంచాయతీలోని చెరువాండ్లపల్లికి చెం దిన గోనే అక్కులప్ప అన్నదానం చేశారు. ఆర్టీసీ వారు ప్రత్యేక బస్సులు నిడిపారు. ఎస్‌ఐ మగ్బుల్‌బాషా సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు.
ముదిగుబ్బ/ అమడగూరు: శ్రావణమాసం చివరి శనివారం పురస్క రించుకుని ముదిగ్బు మండల పరిధిలోని దొరిగల్లు గ్రామంలో వెలసిన వీరాంజనేయ స్వామి కి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పం చిపెట్టి, అన్నసం తర్పణ చేశారు. అ లాగే అమడగూరు మండలపరిధిలోని మహమ్మదాబాద్ లో పిచ్చిలకొండ ఆంజ నేయస్వామికి ప్ర త్యేక పూజలు నిర్వ హించారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....