MLA: పుట్టపర్తి అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
ABN , Publish Date - Jun 18 , 2025 | 12:12 AM
ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్ర మైన పుట్టపర్తి పట్టణాన్ని ప్రజలు, దాతల సహకారంతో అత్యంత సుందరంగా తీర్చితిద్దుదామని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి పేర్కొన్నారు. సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలను దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి మంగళవారం పుట్టపర్తి పట్టణ అభివృద్ధిపై స్థానిక కలె క్టరేట్‌లో కలెక్టర్ టీఎస్ చేతన అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు.
-సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి
పుట్టపర్తి రూరల్, జూన 17(ఆంధ్రజ్యోతి): ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్ర మైన పుట్టపర్తి పట్టణాన్ని ప్రజలు, దాతల సహకారంతో అత్యంత సుందరంగా తీర్చితిద్దుదామని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి పేర్కొన్నారు. సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలను దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి మంగళవారం పుట్టపర్తి పట్టణ అభివృద్ధిపై స్థానిక కలె క్టరేట్‌లో కలెక్టర్ టీఎస్ చేతన అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి పల్లె రఘనాథ రెడ్డితో కలసి జోయాలుకాస్ జ్యువెలరీ ప్రతినిధి జాయ్‌మాత్యూ, టూరిజం, ఇరిగేషన అధికారులతో ఎమ్మెల్యే సమీక్షించారు. పట్టణంలో ఉన్న ప్రముఖ బిల్డర్లు, బాబా భక్తులు, పలువురు దాతలు పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడానికి ముందు కురావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. పుట్టపర్తిని పర్యాటకంగా అన్ని వి ధాలా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకెళుతున్నామన్నారు. అందులో భాగంగా బాబా నడియాడిన చిత్రావతి నదీతీరం, పట్టణంలో మౌలిక వస తులతో పాటు, పుట్‌పాతలు, వీధిదీపాలు ఏర్పాటు చేయాలన్నారు. పట్ట ణాన్ని పరిశుభ్రంగా, సుందరంగా పర్యాటకులను అకట్టుకునే విధంగా తీర్చి దిద్దుతామన్నారు. పట్టణంలో సాయిభక్తులకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందు లు లేకుండా పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణంలో ఉన్న 14 పార్కులను పుడా సహకారం, ప్రజల భాగస్వామ్యంతో అబివృద్ది చేస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్‌కుమార్, మునిసిపల్ కమిషనర్ క్రాంతికుమార్, ఇరిగేషన, టూరిజం, రెవెన్యూ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....