MINiSTER: శత జయంతి వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు
ABN , Publish Date - Nov 12 , 2025 | 12:24 AM
సత్యసాయి బాబా శతజయం తి ఉత్సవాలు రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. మంగళవారం రాత్రిఆమె ప్రశాంతి నిలయంలో శ్రీసత్యసాయి సెంట్రల్ ట్రస్టు కార్యాలయంలో ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్‌తో సమా వేశమై ఏర్పాట్లపై చర్చించారు.
పుట్టపర్తి, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): సత్యసాయి బాబా శతజయం తి ఉత్సవాలు రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. మంగళవారం రాత్రిఆమె ప్రశాంతి నిలయంలో శ్రీసత్యసాయి సెంట్రల్ ట్రస్టు కార్యాలయంలో ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్‌తో సమా వేశమై ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం మంత్రి విలేకరులతో మా ట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు సత్యసాయి శతజయంతి వేడుక లను రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారని తెలి పారు. ఆయన రెండు రోజుల క్రితం వేడుకలకు ఆరుగురు మంత్రుల కమిటీ ఏర్పాటు చేయడమే గాక, అధికారులతో సమీక్ష నిర్వహించార న్నారు. ట్రస్టు ప్రతినిధుల సూచనల మేరకు భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి సూచించినట్లు ఆమె పేర్కొన్నారు. అంతకుముందు రత్నాకర్‌ను మంత్రి పట్టుశాలువాతో సన్మానించారు. నాయకులు వెంకటరమణప్ప, సామకోటి ఆదినారాయణ పాల్గొన్నారు.