Share News

SATHYASAI: జయంతి వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు

ABN , Publish Date - Nov 01 , 2025 | 12:35 AM

సత్యసాయి శత జయంతి ఉత్సవాలకు జిల్లా కేంద్రంలో ఆయా శాఖల అధి కారులు, సిబ్బంది ఏర్పాట్లు ముమ్మరంగా చేపట్టారు. అందులో భాగంగా ప్రధాన వీధుల్లో విద్యుత శాఖ అధికా రులు కొత్తగా విద్యుత స్తంభాలు ఏర్పాటు చేస్తున్నా రు. గురువారం, శుక్రవారం స్థానిక గోపురం రోడ్డులో విద్యుత సిబ్బంది ఎత్తైన విద్యుత స్తంభాలను ఏర్పాట చేస్తున్నారు. పాత స్తంభాలను తొలగించి కొత్తగా ఎత్తైన స్తంభాలు మా ర్చే కార్యక్రమం చేపట్టడంతో జిల్లా కేంద్రంలో పగటిపూట విద్యుత సరఫరాను పూర్తిగా నిలిపివేస్తున్నారు.

SATHYASAI: జయంతి వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు
Personnel doing electrical work

పుట్టపర్తి, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): సత్యసాయి శత జయంతి ఉత్సవాలకు జిల్లా కేంద్రంలో ఆయా శాఖల అధి కారులు, సిబ్బంది ఏర్పాట్లు ముమ్మరంగా చేపట్టారు. అందులో భాగంగా ప్రధాన వీధుల్లో విద్యుత శాఖ అధికా రులు కొత్తగా విద్యుత స్తంభాలు ఏర్పాటు చేస్తున్నా రు. గురువారం, శుక్రవారం స్థానిక గోపురం రోడ్డులో విద్యుత సిబ్బంది ఎత్తైన విద్యుత స్తంభాలను ఏర్పాట చేస్తున్నారు. పాత స్తంభాలను తొలగించి కొత్తగా ఎత్తైన స్తంభాలు మా ర్చే కార్యక్రమం చేపట్టడంతో జిల్లా కేంద్రంలో పగటిపూట విద్యుత సరఫరాను పూర్తిగా నిలిపివేస్తున్నారు. ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం 6 గంటలైనా విద్యుత సరఫరా పూర్తిగా నిలిపివేశారు. దీంతో స్థానికులు ఇబ్బంది పడుతు న్నారు. సత్యసాయి జయంతి వేడుకల సందర్భంలోనే కాకుండా ముందస్తుగా విద్యుత స్తంభాలను ఏర్పాటు చేసి ఉంటే బాగుండేది కదా అని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సత్యసాయి శత జయంతి వేడుకల సందర్భం లోనే ఏదో ఒక మరమ్మతుల పేరుతో విద్యుత సరఫరాను నిలిపేస్తుండడం వల్ల ఇబ్బంది పడాల్సి వస్తుందంటూ పలువురు వాపోతున్నారు.

భూగర్భ డ్రైనేజీకి మరమ్మతులు

పట్టణంలోని భూగర్భ డ్రైనేజీ మరమ్మతుల పనుల్లో సిబ్బంది నిమగ్నమయ్యారు. సత్యసాయి జయంతి వేడుకల్లో భూగర్భ డ్రైనేజీలో సమస్య తలెత్తకుండా ముందస్తు జా గ్రత్తగా మరమ్మతుల పనులు చేపట్టారు. శుక్రవారం స్థానిక చిత్రావతి రోడ్డులోని చాంబర్‌లను సిబ్బంది శుభ్రం చేశారు. చాంబర్‌ ఇరుక్కుపోయిన చెత్తను తొలగించారు.


తరచూ డ్రైనేజీ పైపులైనలలో అక్కడక్కడ చాంబర్లు చెత్తతో మూ సుకు పోయి మురుగునీరు పైకొచ్చేది. గతంలో సత్యసాయి జయంతి వేడుకల్లోనే గోపురం రోడ్డులో డ్రైనేజీ చాంబర్లు పొంగిపొర్లి మురుగునీటితో భక్తులు ఇబ్బంది పడ్డారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ముందస్తుగా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే డ్రైనేజీ ఛాంబర్‌లన్నింటిలో చెత్తను తీసివేసి పైప్‌లైన్లలో సైతం నీరు సులభంగా పోయేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

రథోత్సవానికి ఇబ్బంది కాకుండా స్తంభాల మార్పు

- సాయినాథ్‌, విద్యుత శాఖ అర్బన ఇంజనీరు

సత్యసాయి శత జయంతి వేడుకల్లో వేణుగోపాల స్వామి రథోత్సవం నిర్వహణకు ఎలాంటి ఆటంకం ఉండకూడదని ముందస్తుగా పట్టణంలో ఎత్తైన విద్యుత స్తంభాలను ఏ ర్పాటు చేస్తున్నాం. ఇందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, దీంతో గతంలో ఉన్న పాత చిన్న విద్యుత స్తం భాలను తొలగించి, వాటి స్థానంలో ఎత్తైన విద్యుత స్తం భాలను ఏర్పాటు చేస్తున్నాం. ఈ పనుల చేపట్డడం వలన కొద్ది రోజులు విద్యుత సరఫరాలో అంతరాయం కలుగు తుంది. రెండు రోజుల్లో పనులు పూర్తి చేస్తాం.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Nov 01 , 2025 | 12:35 AM