Share News

CPI: చుక్కల భూముల సమస్యను పరిష్కరించండి

ABN , Publish Date - Dec 08 , 2025 | 11:59 PM

మండలంలో నెలకొన్న చుక్కల భూముల సమస్యతో పాటు ఫ్రీహోల్డ్‌ భూముల సమస్యలను పరిష్కరించాలని సీపీఐ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు రైతులు సోమవారం సీపీఐ ఆధ్వర్యంలో స్థానిక విద్యుత శాఖ కార్యాల యం వద్ద నుంచి ర్యాలీగా వెళ్లి, జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.

CPI: చుక్కల భూముల సమస్యను పరిష్కరించండి
CPI leaders doing Rasta Roko

సీపీఐ నాయకుల డిమాండ్‌

తహసీల్దార్‌ కార్యాలయానికి తాళం వేసి నిరసన

ముదిగుబ్బ, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): మండలంలో నెలకొన్న చుక్కల భూముల సమస్యతో పాటు ఫ్రీహోల్డ్‌ భూముల సమస్యలను పరిష్కరించాలని సీపీఐ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు రైతులు సోమవారం సీపీఐ ఆధ్వర్యంలో స్థానిక విద్యుత శాఖ కార్యాల యం వద్ద నుంచి ర్యాలీగా వెళ్లి, జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. అనంతరం రెవెన్యూ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి, తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఇనచార్జ్‌ తహసీల్దార్‌ మునిస్వామికి అందజేశారు. ఈ మేరకు సీపీఐ నాయకులు ఎమ్మార్వో కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు మాట్లాడుతూ... 1954 ముందున్న పాత పట్టా భూములు చాలా వరకు 2018 నుంచి 22ఎ నిషేధిత జాబితాలో చేర్చడంతో, చుక్కల భూములుగా నమోదై నేటికీ రిజిస్ట్రేషనకు నోచుకోకుండా పోయాయన్నారు. ఈ కార్యక్రమంలో తిప్పయ్య, ఈశ్వర్‌ నాయక్‌, రమేష్‌ నాయు డు, వెంకట్‌రాముడు, కుర్రనాయుడు, లింగుట్ల రామకృష్ణ, వెంకటేశ్వర నాయక్‌, శంకర, ఎం మధు, వెంకటేష్‌, కొండయ్య, మంగలి శీనా, చాం ప్లా నాయక్‌, సన్నాభాయ్‌, సరస్వతి భాయ్‌, రైతులు తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Dec 08 , 2025 | 11:59 PM