VALMIKI: ఘనంగా వాల్మీకి జయంతి
ABN , Publish Date - Oct 07 , 2025 | 11:49 PM
మనిషి జీవిత సత్యాన్ని తెలిపే విధంగా వాల్మీకి మహర్షి రామాయణ మహా కావ్యాన్ని రచించారని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. వారు మంగళవారం వాల్మీకి జయంతి సందర్భంగా కొత్తచెరువుమండల కేంద్రంలోని వాల్మీకి విగ్రహానికి పూల మాల వేసి పూజలు చేశారు. బుక్కపట్నంలోని వాల్మీకి రామాలయంలో పూజలు నిర్వహించారు.
(ఆంధ్రజ్యోతి, న్యూస్ నెట్‌వర్క్)
మనిషి జీవిత సత్యాన్ని తెలిపే విధంగా వాల్మీకి మహర్షి రామాయణ మహా కావ్యాన్ని రచించారని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. వారు మంగళవారం వాల్మీకి జయంతి సందర్భంగా కొత్తచెరువుమండల కేంద్రంలోని వాల్మీకి విగ్రహానికి పూల మాల వేసి పూజలు చేశారు. బుక్కపట్నంలోని వాల్మీకి రామాలయంలో పూజలు నిర్వహించారు. ధర్మవరం పట్టణంలోని ప్రభుత్వాస్పత్రి వద్ద ఉ న్న వాల్మీకి మహర్షి విగ్రహానికి జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డితో పాటు అహుడా చైర్మన టీసీ వరుణ్, స్వచ్ఛాంధ్ర మి షన రాష్ట్ర డైరెక్టర్ భవాని, బీజేపీ నియోజకవర్గ ఇనచార్జ్ హరీశబాబు పూజలు చేశారు. ధర్మవరంరూరల్ మండలంలోని ఏలుకుంట్లలో కార్యక్ర మానికి బీసీ ఐక్యవేదిక రాయలసీమ అధ్యక్షుడు కొట్టాల శ్రీరాములు హాజర య్యారు. దర్శినమలలో జ్యోతులు, బోనాలను మహిళలు ఊరేగింపు తీసుకె ళ్లి వాల్మీకి విగ్రహం వద్ద పూజలు చేశారు. కదిరి పట్టణంలో కోనేరు వద్ద ఉన్న వాల్మీకి విగ్రహానికి ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బంగారు క్రిష్ణమూర్తి తదితరులు పూజలు చేశారు. అలాగే తాడిమర్రి మండలం మరువ పల్లిలో జరిగిన కార్యక్రమంలో ముదిగుబ్బ రూరల్ సీఐ శ్యామరావు పాల్గొని కేక్ కట్ చేశారు. అలాగే ముదిగుబ్బలో, తలుపుల తహసీల్దార్ కార్యాల యం లో, పులిగిండ్లపల్లిలో, ఓబుళదేవరచెరువు మండలం మిట్టపల్లిలో, గాండ్లపెంట, నల్లచెరువు తహసీల్దార్ కార్యాలయాల్లో, నల్లమాడ మండలంలోని రెడ్డిపల్లిలో వాల్మీకి చిత్ర పటానికి పూల మాల లు వేసి పూజలు చేశారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....