MLA: సొసైటీలు రైతులకు వెన్నెముకలాంటివి
ABN , Publish Date - Sep 04 , 2025 | 12:19 AM
ప్రాథమిక సహకార సొసైటీ లు రైతులకు వెన్నెముకలాంటివని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి పేర్కొ న్నారు. మండల పరిధిలోని కేశాపురం ప్రాథమిక సహకార సొసైటీ పాల కవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. ఎ మ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి
కొత్తచెరువు, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి):ప్రాథమిక సహకార సొసైటీ లు రైతులకు వెన్నెముకలాంటివని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి పేర్కొ న్నారు. మండల పరిధిలోని కేశాపురం ప్రాథమిక సహకార సొసైటీ పాల కవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. ఎ మ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రధాన మంత్రి నరేం ద్రమోదీ సహకారంతో సీఎం చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవనకల్యాణ్ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి బాటలో నడిపిస్తున్నార న్నారు. అదే వైసీపీ హయాంలో దాడులు, కూల్చివేతలు తప్ప అబివృద్ధి మచ్చుకైన కనిపించలేదని విమర్శించారు. సహకార వ్యవస్థను నిర్వీర్యం చేశారన్నారు. సహకార సంఘాల ద్వారా విరివిగా రుణాలు, ఎరువులు, పురుగు మందులు అందిస్తామని రైతులకు హామీ ఇచ్చారు. కేశాపురం సహకార సంఘం అధ్యక్షుడిగా జనసేన పార్టీకి చెందిన బాబయ్యను ఎంపిక చేశామన్నారు. సత్యనారాయణ అనే రైతు సహకార సొసైటీ కింద బీమా చేయించాడు. ఆయన మృతిచెందడంతో మంజూరైన రూ. 2లక్షల బీమా చెక్కులను ఆయన భార్య ప్రతిభాకు సహకార సొసైటీ అధ్యక్షుడు బాబయ్య, రాష్ట్ర సాగునీటి సంఘం కార్పొరేషన డైరెక్టర్ పత్తి చంద్రశేఖర్‌లతో కలిసి ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో పుట ్టపర్తి మార్కెట్‌యార్డ్ చైర్మన పూలశివ, టీడీపీ మండల, పట్టణ కన్వీనర్లు రామకృష్ణ, ఒలిపి శీన, జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ, కొత్తచె రువు, తలమర్ల, బుక్కపట్నం సింగిల్‌విం డో అధ్యక్షులు హరిప్రసాద్, గోపాల్‌రెడ్డి, చెన్నక్రిష్ణ, నాయకులు లక్ష్మీనారాయణ, శంకరప్ప, ముమ్మనేని వెంకటరాముడు, సాగునీటిసంఘం అధ్యక్షుడు సంజీవరాయుడు, అశ్వ త్థప్ప, నవీనకుమార్, బీజేపీ నాయకులు ధర్మతేజ, జనసేన నాయకులు గూడా సోము, అల్లాడి జయరాం, కెంపుల జనార్దన, డాన సూరి పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....