Share News

ELECTRICITY: ఇంత నిర్లక్ష్యమా..!

ABN , Publish Date - May 22 , 2025 | 12:24 AM

విద్యుత శాఖ అధికారులు, ఉద్యోగుల నిర్లక్ష్యానికి కొన్ని సందర్భాలు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి. కక్కలపల్లి పంచాయతీ పరిధిలో విద్యుత సరఫరాలో ఏర్పడిన అంతరాయం ఇందుకు ఉదాహరణ. బుధవారం తెల్లవారుజామున 5గంటల సమయంలో బీజేపీ కొట్టాల, ప్రజాశక్తి కాలనీలోని ఇళ్లకు విద్యుత సరఫరా నిలిచిపోయింది.

ELECTRICITY: ఇంత నిర్లక్ష్యమా..!
Prajashakti Kalani is a transformer near Anjane Swamy Temple

- ప్రజాశక్తి నగర్‌లో ఇళ్లకు కరెంట్‌

- కాలిపోయిన ఫ్యానలు, ఇన్వర్టర్లు

- 24 గంటలుగా చీకట్లో సగం కాలనీ

అనంతపురం రూరల్‌, మే 21 (ఆంధ్రజ్యోతి): విద్యుత శాఖ అధికారులు, ఉద్యోగుల నిర్లక్ష్యానికి కొన్ని సందర్భాలు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి. కక్కలపల్లి పంచాయతీ పరిధిలో విద్యుత సరఫరాలో ఏర్పడిన అంతరాయం ఇందుకు ఉదాహరణ. బుధవారం తెల్లవారుజామున 5గంటల సమయంలో బీజేపీ కొట్టాల, ప్రజాశక్తి కాలనీలోని ఇళ్లకు విద్యుత సరఫరా నిలిచిపోయింది. ట్రాన్సఫార్మర్‌లో సమస్య కారణంగా ఇళ్ల గోడలకు, వస్తువులకు విద్యుత సరఫరా అయింది. పలు ఇళ్లలో విద్యుత వైర్లు, ఫ్యానలు, బల్బులు కాలిపోయాయి. ఇన్వర్టర్లు చెడిపోయాయి. ఒక రోజు గడిచినా అధికారులు విద్యుత సరఫరాను పునరుద్ధరించ లేదు. దీంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నేళ్లుగా స్థానికంగా విద్యుత సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీనికితోడు ఇళ్ల గోడలకు కరెంటు సరఫరా అవుతోంది. రాత్రి వేళల్లో ఇళ్లలో లైట్లు ఆఫ్‌ చేసినా వెలుగుతున్నాయి. స్థానికంగా ఉన్న ట్రాన్సఫార్మర్‌తో పాటు విద్యుత లైనలోను సమస్యలు ఉన్నాయని కాలనీవాసులు అంటున్నారు. ఈ విషయాన్ని అనేక సార్లు విద్యుత అధికారులు, సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల సీపీఎం నాయకులు విద్యుత శాఖ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. అయినా ప్రయోజనం లేదు. సమస్య చెప్పిన వారిపై స్థానిక సిబ్బంది చిందులు వేస్తున్నారని చెబుతుండటం గమనార్హం. రెండురోజుల కిందట పాత ట్రాన్సఫార్మర్‌ను మార్చి మరో ట్రాన్సఫార్మర్‌ను ఏర్పాటు చేశారు. అది కూడా పాతదే కావడంతో సమస్య తిరిగి మొదటికి వచ్చింది. ఈ విషయంపై సంబంధిత ఏఈఈ సోమశేఖర్‌ను వివరణ కోరగా... సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పాడైపోయిన ట్రాన్సఫార్మర్‌ స్థానంలో మరో ట్రాన్సఫార్మర్‌ ఏర్పాటు చేస్తామని తెలిపారు. కానీ బుధవారం రాత్రికి కూడా ఏర్పాటు చేయలేకపోయారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - May 22 , 2025 | 12:24 AM