DEVOTIONAL: భక్తిశ్రద్ధలతో శ్రావణ పౌర్ణమి
ABN , Publish Date - Aug 10 , 2025 | 12:01 AM
పట్టణంలోని తేరు బజారులో వెలసి న శ్రీరామభజన మందిరంలో శ్రావణ పౌర్ణమి ఉత్సవాల్లో భాగంగా స్వామి వారిని తిరుమంజున సేవను ఘనంగా నిర్వహించారు. గోవింద మాలధా రణ సేవా కమిటీ సభ్యులు దేవతా కృష్ణమూర్తి, కోటి వెంకటేశ్వర్లు, సుఖా నంద ఆధ్వర్యంలో శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వరస్వామి ఉత్సవ విగ్ర హాలను ప్రత్యేకంగా అలంకరించి పట్టణంలో ఊరేగించారు.
ధర్మవరం, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని తేరు బజారులో వెలసి న శ్రీరామభజన మందిరంలో శ్రావణ పౌర్ణమి ఉత్సవాల్లో భాగంగా స్వామి వారిని తిరుమంజున సేవను ఘనంగా నిర్వహించారు. గోవింద మాలధా రణ సేవా కమిటీ సభ్యులు దేవతా కృష్ణమూర్తి, కోటి వెంకటేశ్వర్లు, సుఖా నంద ఆధ్వర్యంలో శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వరస్వామి ఉత్సవ విగ్ర హాలను ప్రత్యేకంగా అలంకరించి పట్టణంలో ఊరేగించారు. అలాగే ధర్మవ రంచెరువు ఏడో మరువ వద్ద వెలసిన ఆంజనేయస్వామి ఆలయంలో శ్రావణ మాస పూజలను అర్చకులు ఘనంగా నిర్వహించారు.
నల్లచెరువు: మండలపరిధిలో ప్రసిద్ధి చెందిన పాలపాటిదిన్నె ఆంజ నేయస్వామికి శ్రావణమాసం మూడో శనివారం పురస్కరించుకుని ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులతో ఆలయం కిటకిటలాడింది. భక్తులకు ఆంధ్రప్రదేశ గ్రామీణ బ్యాంక్ వారు అన్నదానం నిర్వహించారు. ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. సీఐ నాగేంద్రకు మార్ సిబ్బందితో కలిసి ఆలయం వద్ద శాంతి భద్రతలను పర్యవేక్షించారు. ఆర్డీఓ వీవీ ఎస్‌శర్మ, ఆర్టీసీ డీఎం మైనోద్దీన స్వామిని దర్శించుకున్నారు.
ధర్మవరంరూరల్: మండలంలోని గొట్లూరులో వెలసిన ప్రసిద్ధి గా వించిన ఆంజనేయస్వామి ఆలయంలో శ్రావణ శనివారం పూజలు ఘనంగా నిర్వహిం చారు. ఆలయ అర్చకుడు సత్య నారాయణ మూలవిరాట్‌ను ప్రత్యేకంగా అలం కరించి పూజలు చేశారు. అన్నదానం చేశారు. అలాగే పట్టణంలోని కొత్తపేటలో వెలసిన లక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయంలో స్వా మివారి కళ్యాణోత్సవాన్ని శనివారం క న్నుల పండువగా నిర్వహించారు. అర్చ కులు సుదర్శనాచార్యులు, ఆయన బృం దం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి కల్యాణోత్సవాన్ని జరిపించారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....