EMPLOYEES: సచివాలయంలో ఉద్యోగుల కొరత
ABN , Publish Date - Dec 18 , 2025 | 11:59 PM
మండలంలోని నేలకోట గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్ లేకపోవడంతో దాని పరిధిలోని మూడు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న డిజిటల్ అసిస్టెంట్ జ్యోతి, వెల్ఫేర్ అసిస్టెంట్ ఉపేంద్ర దాదాపు నెల రోజుల క్రితం లాంగ్‌లీవ్‌లో వెళ్లారు.
లాంగ్‌లీవ్‌లో వెళ్లిన డిజిటల్, వెల్ఫేర్ అసిస్టెంట్లు
ఇబ్బందులు పడుతున్న మూడు గ్రామాల ప్రజలు
ధర్మవరం రూరల్, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): మండలంలోని నేలకోట గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్ లేకపోవడంతో దాని పరిధిలోని మూడు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న డిజిటల్ అసిస్టెంట్ జ్యోతి, వెల్ఫేర్ అసిస్టెంట్ ఉపేంద్ర దాదాపు నెల రోజుల క్రితం లాంగ్‌లీవ్‌లో వెళ్లారు. రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ ఏర్ప డినప్పటి నుంచి ఏ పని కావాలన్నా ప్రజలు గ్రామ సచివాలయానికి వెళ్లాల్సిందే. ప్రధానంగా జ నన, మరణ ధ్రువీకరణ పత్రాలు, పొజిషన సర్టిఫికెట్లు, కుల ధ్రువీ కరణపత్రాలు, రేషన కార్డులో మార్పులు, చేర్పులు తదితర వాటికోసం నిత్యం ప్రజలు గ్రామ సచివాలయానికి వెళుతుంటారు. ఈ సేవలన్నీ డిజిటల్ అసిస్టెంట్ ద్వారా పొందాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు కోసం వెల్ఫేర్ అసిస్టెంట్‌ను సంప్రదించాల్సి ఉంటుం ది. అయితే నేల కోట గ్రామ సచివాలయంలో ఆ ఇద్దరూ లాంగ్‌లీవ్‌లో వెళ్లడంతో నెలరోజులుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
ఆ గ్రామ సచివాలయం పరిధిలో నేలకోట, నేలకోటతండా, బిల్వంపల్లి గ్రామాలు ఉన్నాయి. వివిధ పనుల నిమిత్తం నేలకోట గ్రామ సచివాలయానికి వెళితే డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్‌అసిస్టెంట్ లేకపోవడంతో సంబంధిత సేవలు అందడం లేదని ఆ గ్రామాల ప్రజలు అంటున్నారు. అవసరమై ఏవైనా పత్రాలు కావాలని సమీపంలోని వేరే గ్రామ సచివాలయానికి వెళితే.... మీ గ్రామం మా పరిధిలోకి రాదంటూ అక్కడి సిబ్బంది చెప్పి పంపుతున్నారని వారు వాపోతున్నారు. డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్ లేక ఇబ్బందులు పడుతున్నామని ఆయా గ్రామస్థులు ఎంపీడీఓ దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం చూపలేదని ఆరోపిస్తున్నారు. డిజిటల్ అసిస్టెంట్, వెల్పేర్ అసిస్టెంట్ విధుల్లో చేరే వరకు పక్క గ్రామాల సచివాలయాల సిబ్బంది అయినా కనీసం వారంలో రెండు, మూడు రోజులు ఈ సచివాలయంలో విధులు నిర్వహిస్తే సంబంధిత సేవలు అందుతాయని ఆయా గ్రామప్రజలు కోరుతున్నారు.
ఈ విషయంపై డిప్యూటీ ఎంపీడీఓ వెంకటేష్‌ను వివరణ కోరగా... నేలకోట గ్రామ సచివాలయం డిజిటల్ అసిస్టెంట్, వెల్పేర్ అసిస్టెంట్ లీవ్‌లో ఉన్నారని తెలిపారు. అయితే ప్రజలకు ఇబ్బందిలేకుండా ఆ గ్రామ సచివాలయంలోని ఇతర సిబ్బంది ద్వారా సంబంధిత సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....