Share News

BJP: జిల్లా కేంద్రం తరలింపు అపోహే

ABN , Publish Date - Aug 24 , 2025 | 11:40 PM

జిల్లా కేంద్రం మార్పుపై ఇటీ వల వస్తున్న వదంతులు కేవ లం ఆపోహ మాత్రమేనని, వాటిని నమ్మాల్సిన అవసరంలేదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుడెసె దేవానంద్‌, జిల్లా అధ్యక్షుడు జీఎం శేఖర్‌ పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియామకమైన గుడెసె దేవానంద్‌ను ఆదివారం జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీఎం శేఖర్‌, పట్టణ అధ్యక్షుడు కళ్యాణ్‌కుమార్‌ ఘనంగా సన్మానించారు.

BJP: జిల్లా కేంద్రం తరలింపు అపోహే
BJP district president GM Shekhar is speaking

బీజేపీ నాయకులు

పుట్టపర్తి రూరల్‌, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రం మార్పుపై ఇటీ వల వస్తున్న వదంతులు కేవ లం ఆపోహ మాత్రమేనని, వాటిని నమ్మాల్సిన అవసరంలేదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుడెసె దేవానంద్‌, జిల్లా అధ్యక్షుడు జీఎం శేఖర్‌ పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియామకమైన గుడెసె దేవానంద్‌ను ఆదివారం జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీఎం శేఖర్‌, పట్టణ అధ్యక్షుడు కళ్యాణ్‌కుమార్‌ ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ... జిల్లా కేంద్రం మార్పుపై ఇటీవల కాలంలో వస్తున్న వదంతులు కేవలం అపోహ అన్నారు. జిల్లాకేంద్రం తరలింపు గురించి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించలేదని, క్యాబినెట్‌ సమావే శంలో చర్చ జరగలేదన్నారు. ఈ వదంతులను నమ్మాల్సిన అవసరం లే దని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధానకార్యదర్శి హరికృష్ణగౌడ్‌, జిల్లా అధికార ప్రతినిధి జ్యోతిప్రసాద్‌, కోశాధికారి సురేంద్రబాబు, కార్యదర్శి కుసుమజయరాం, ఐటీసెల్‌ కన్వీనర్‌ భాస్కర్‌, జిల్లా కార్యవర్గ సభ్యులు రామాంజినేయులు, నాయకులు బాలగంగాదర్‌, గొడుగు నాగరాజు, శేషాద్రి నాయుడు, దళిత మోర్చా నాయకులు గంగిశెట్టి, అనిల్‌కుమార్‌, విష్ణు, పట్టణ కమిటీ సభ్యులు కుమార్‌, నారాయణ తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Aug 24 , 2025 | 11:40 PM