Share News

GAMES: ఎస్‌జీఎఫ్‌ డివిజన స్థాయి పోటీలు ప్రారంభం

ABN , Publish Date - Oct 29 , 2025 | 11:30 PM

పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో కదిరి డివిజన స్థాయి ఎస్‌జీఎఫ్‌ పోటీలను డీఈఓ కిష్టప్ప బుధవారం ప్రారంభించారు. బాల బాలికలు అండర్‌ -14, 17 విభాగాలలో చెస్‌, యోగా, షటీల్‌ క్రీడలలో పాల్గొన్నారు.

GAMES: ఎస్‌జీఎఫ్‌ డివిజన స్థాయి పోటీలు ప్రారంభం
DEO speaking at the opening ceremony of the sports competition

కదిరి, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో కదిరి డివిజన స్థాయి ఎస్‌జీఎఫ్‌ పోటీలను డీఈఓ కిష్టప్ప బుధవారం ప్రారంభించారు. బాల బాలికలు అండర్‌ -14, 17 విభాగాలలో చెస్‌, యోగా, షటీల్‌ క్రీడలలో పాల్గొన్నారు. కాసేపు విద్యార్థులతో డీఈఓ షటిల్‌ ఆడారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓలు చెన్న కృష్ణ, ఓబులరెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటాచలం, పలువురు పీడీలు డీఈఓను దుశ్శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పీడీలు లష్కర్‌నాయక్‌, హరి, శంకర్‌నాయక్‌, రవీంద్రనాయక్‌ సాయికృష్ణ, షబ్బీర్‌, యశోద, సుజాత, పద్మ, మహేశ్వరి, రేవతి, కోమల, అశ్విని తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Oct 29 , 2025 | 11:30 PM