DRAIN: కాలువల్లో కదలని మురుగు
ABN , Publish Date - Sep 29 , 2025 | 12:21 AM
అడుగడుగునా అపరిశుభ్రత తాండవిస్తోంది. దోమలు వృద్ధిచెంది ప్రజలు జ్వరాలతో బాధపడుతున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆయా కాలనీల వాసులు మండిపడుతున్నారు. మండలకేంద్రమైన బత్తలపల్లిలోని టీచర్స్ కాలనీ, ఎస్సీ కాలనీ, మైనార్టీ కాలనీలలో ఈ పరిస్థితి నెలకొంది. డ్రైనేజీ కాలువలు చెత్త చెదారంతో పూడిపోయాయి.
దోమలు, దుర్వాసనతో ప్రజలు సతమతం
బత్తలపల్లి, సెప్టంబరు 24 (ఆంధ్రజ్యోతి): అడుగడుగునా అపరిశుభ్రత తాండవిస్తోంది. దోమలు వృద్ధిచెంది ప్రజలు జ్వరాలతో బాధపడుతున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆయా కాలనీల వాసులు మండిపడుతున్నారు. మండలకేంద్రమైన బత్తలపల్లిలోని టీచర్స్ కాలనీ, ఎస్సీ కాలనీ, మైనార్టీ కాలనీలలో ఈ పరిస్థితి నెలకొంది. డ్రైనేజీ కాలువలు చెత్త చెదారంతో పూడిపోయాయి. మురుగు ముందుకు కదలక నిల్వ ఉంటోంది. దీంతో దోమలు వృద్ధి చెంది, ప్రజలు ఆనారోగ్యానికి గురవుతున్నారు. డ్రైనేజీ కాలువలను నెలలు గడిచినా శుభ్రం చేయడం లేదన్నారు. నిల్వ ఉన్న మురుగుతో వెదజల్లుతున్న దుర్వాసన భరించలేక పోతున్నా మని ఆయా కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల రోజులుగా దోమల దాడితో పలువురు జ్వరాల బారిన పడుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి రూ. వేలు ఖర్చుచేసుకుంటున్నామని, అయితే వైద్య సిబ్బం ది ఇటు వైపు చూడడం లేదని ప్రజలు వాపోతున్నారు. డబ్బులు ఇచ్చిన వారి ఇళ్లు, హోటళ్లు, చికెన సెంటర్లు, దుకాణాల వద్దే పంచాయతీ కార్మికు లు శుభ్రం చేస్తున్నారని, మిగిలిన ప్రాంతాలను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఈ విషయం తెలిసినా అధికారులు తెలియనట్లు నిమ్మకుండిపోతున్నారని మండిపడుతున్నారు. పైగా పంచాయతీ కార్మికులు కాలువలను శుభ్రం చేయడం, బీచింగ్ చల్లడం, ఈ కాలనీల్లో ఫాగింగ్ చేయడం మరిచిపోయారని అంటున్నారు. ఫాగింగ్ చేయక దాదాపు ఎనిమిదేళ్లు అవుతోందంటున్నా రు. గతంలో టీడీపీ హయాంలో మాత్రమే ఫాగింగ్ చేశారని ఆ తరువాత ఇటువైపు తొంగి చూడలేదని చెబుతున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు తమ కాలనీల గురించి పట్టించుకోకుండా చిన్న చూపు చూస్తున్నారని వారు విమర్శిస్తున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....