Share News

SEWAGE: రోడ్డుపై మురుగునీటి ప్రవాహం

ABN , Publish Date - Aug 24 , 2025 | 12:45 AM

మండల కేంద్రంలో డ్రైనేజీ కాలువలు పూడిపోవడంతో మురుగునీరు రోడ్లపై పారుతోందని గ్రామస్థు లు వాపోతున్నారు. మురుగునీరు వెళ్లడానికి ఏర్పాటు చేసిన కాలువలు చెత్తచెదారంతో నిండిపోయాయి. జీన్లకుంట రోడ్డులోని వెలుగు కార్యా లయానికి వెళ్లే దారిలో కాలువ పూడిపోవడంతో మురుగునీరు రోడ్డుపైనే పారుతోంని. ఆ నీటిలోనే నడుచుకుంటూ కార్యాలయాలకు, వీధిలోకి వెళ్లాల్సి వస్తోందని కాలనీవాసులు వాపోతున్నారు.

SEWAGE: రోడ్డుపై మురుగునీటి ప్రవాహం
Sewage flowing on the road

గాండ్లపెంట, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో డ్రైనేజీ కాలువలు పూడిపోవడంతో మురుగునీరు రోడ్లపై పారుతోందని గ్రామస్థు లు వాపోతున్నారు. మురుగునీరు వెళ్లడానికి ఏర్పాటు చేసిన కాలువలు చెత్తచెదారంతో నిండిపోయాయి. జీన్లకుంట రోడ్డులోని వెలుగు కార్యా లయానికి వెళ్లే దారిలో కాలువ పూడిపోవడంతో మురుగునీరు రోడ్డుపైనే పారుతోంని. ఆ నీటిలోనే నడుచుకుంటూ కార్యాలయాలకు, వీధిలోకి వెళ్లాల్సి వస్తోందని కాలనీవాసులు వాపోతున్నారు. అంతేగాకుండా ము రుగునీరు నిలువ ఉండడంతో దోమలు వృద్ధిచెంది విషజ్వరాల బారిన పడాల్సి వస్తోందంటున్నారు. ప్రతి నాలుగో శనివారం స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ దివాస్‌ అంటూ అధికారులు అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్నారేకానీ, కాలువల్లో చెత్త తొలగించడాన్ని పట్టించుకోవడంలేదని ప్రజలు మండిపడు తున్నారు. గ్రామంలోని పలు గ్రామాల్లో మురుగునీటి కాలువులు పూడి పోయాయని తెలిపారు. ఇప్పటికైనా గ్రామాల్లో మురుగునీటి కాలువలు శుభ్రంచేయాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Aug 24 , 2025 | 12:45 AM