RDO: ప్రజలకు మెరుగైన సేవలందించండి : ఆర్డీఓ
ABN , Publish Date - Sep 04 , 2025 | 12:26 AM
ప్రజలకు మెరుగైన సేవలందించేలా దృష్టి సారించాలని ఆర్డీఓ మహేశ అధికారులకు సూచించారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ఆయన బుధవారం రెవెన్యూ, సర్వే అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆర్డీఓ మాట్లాడుతూ...ప్రస్తుత కాలంలో ఎదు రవుతున్న అత్యవసర సమస్యలు, ప్రాధాన్యమైన పనులు, పెం డింగ్‌లో ఉన్న సమస్యలను సకాలంలో పరిష్కరించేందుకు శ్రద్ధ వహించాలన్నారు.
ధర్మవరం, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): ప్రజలకు మెరుగైన సేవలందించేలా దృష్టి సారించాలని ఆర్డీఓ మహేశ అధికారులకు సూచించారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ఆయన బుధవారం రెవెన్యూ, సర్వే అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆర్డీఓ మాట్లాడుతూ...ప్రస్తుత కాలంలో ఎదు రవుతున్న అత్యవసర సమస్యలు, ప్రాధాన్యమైన పనులు, పెం డింగ్‌లో ఉన్న సమస్యలను సకాలంలో పరిష్కరించేందుకు శ్రద్ధ వహించాలన్నారు. ముఖ్యంగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక లో వచ్చిన అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలన్నారు. ఇటీవల పొలాల రస్తా, పొలాల సరిహద్దు వివాదాలు ఎక్కువగా వస్తున్నాయని, వాటిని సకాలంలో పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలని ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో పనిచేసే రెవెన్యూ, సర్వే అధికారులు, వీఆర్‌ఓలు, విలేజ్ సర్వేయర్లు అత్యంతకీలక పాత్ర పోషించాలని ఆర్డీఓ పేర్కొన్నారు.
అన్నక్యాంటీన తనిఖీ
ధర్మవరం, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్న అన్యక్యాంటీనను బుధవారం ఆర్డీఓ మహేశ ఆకస్మింగా తనిఖీచేశారు. భోజనం నాణ్యత, రుచి, పరిమాణం గు రించి లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు,, పరిశుభ్రత, హైజిన తదితర అంశాలను తనిఖీ చే శారు. వంటశాలలో శుభ్రత, పదార్థాల నాణ్యత, లబ్ధిదారుల రిజి స్టర్ నిర్వహణను పరిశీలించారు. నాణ్యతలో రాజీ లేకుండా సకాలంలో భోజనం అందించాలని ఆర్డీఓ సిబ్బందిని ఆదేశించారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....