MLA: సీమను సస్యశ్యామలం చేస్తాం
ABN , Publish Date - Sep 05 , 2025 | 12:21 AM
కరువుకు నిలయ మైన రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు ము ఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభు త్వం కంకణం కట్టుకుందని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి పేర్కొన్నారు. వారు గురువారం ప ట్నం వద్ద హంద్రీనీవా సుజల స్రవంతి మెయిన బ్రాంచ కెనాల్ ద్వారా తలుపుల, పులివెందుల మండలాలకు నీటిని విడుదల చేశారు.
ఎమ్మెల్యే కందికుంట
కదిరి అర్బన, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): కరువుకు నిలయ మైన రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు ము ఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభు త్వం కంకణం కట్టుకుందని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి పేర్కొన్నారు. వారు గురువారం ప ట్నం వద్ద హంద్రీనీవా సుజల స్రవంతి మెయిన బ్రాంచ కెనాల్ ద్వారా తలుపుల, పులివెందుల మండలాలకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఎన్టీఆర్ మానస పుత్రిక అయిన హంద్రీనీవా సుజల స్రవంతి పథకాన్ని నాడు ఎన్టీ ఆర్ ప్రారంభిస్తే, ప్రస్తుతం చంద్రబాబు పూర్తి చేశారన్నారు. రాయలసీ మ ప్రాంతానికి నీటిని తీసుకురావడం చరిత్రాత్మకం అన్నారు. గతంలో వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే ప్రాంతం లో జలదీక్ష చేశారని, అయితే అధికారంలోకి వచ్చిన తరువాత గంట మాత్రమే నీరు వదిలి మమ అనిపించారని విమ ర్శించారు. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఈ రోజు తలుపుల మండలంతో పాటు పులివెందలకు నీటిని త రలించామ న్నారు. టీడీపీ పులివెందల ఇనచార్జ్ బిటెక్ రవి, హెచ ఎనఎస్ అధికారులు, కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....