SCHOOL: సమయపాలన లేని పాఠశాల
ABN , Publish Date - Oct 15 , 2025 | 12:17 AM
తన రూటే సెపరేటు అన్నట్లు సాగుతోంది ఆ పాఠశాల పరిస్థితి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలన్నీ ఉద యం గం. 8.30 నుంచి మధ్యాహ్నం గం. 3.30 వరకు కొనసాగుతుం టే, సంగాల గ్రామంలోని ప్రాథమిక పాఠశాల మాత్రం మధ్యాహ్నం ఒంటి గంట లోపలే మూతపడుతోంది. మండలంలోని సంగాల గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఐదుగురు విద్యార్థులు ఉన్నారు.
బత్తలపల్లి, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): తన రూటే సెపరేటు అన్నట్లు సాగుతోంది ఆ పాఠశాల పరిస్థితి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలన్నీ ఉద యం గం. 8.30 నుంచి మధ్యాహ్నం గం. 3.30 వరకు కొనసాగుతుం టే, సంగాల గ్రామంలోని ప్రాథమిక పాఠశాల మాత్రం మధ్యాహ్నం ఒంటి గంట లోపలే మూతపడుతోంది. మండలంలోని సంగాల గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఐదుగురు విద్యార్థులు ఉన్నారు. వీరిలో ఒకటో తరగతిలో ఒక బాలుడు, ఇద్దరు బాలికలు, నాలుగో తరగతి ఒక బాలుడు. ఐదో తరగతిలో ఒక బాలుడు ఉన్నారు. ఒక ఉపాధ్యాయుడు ఉన్నారు. అయితే ఆ ఉపాధ్యా యుడు ప్రతి రోజూ మధ్యాహ్నం ఒంటి గంటలోపే పాఠశాలకు తాళం వేసి వెళుతున్నాడని గ్రామస్థులు వాపోతున్నారు. ఆయన మంగళవారం కూడా మధ్యాహ్నం ఒంటి గంటకే పిల్లలను ఇళ్లకు పంపి పాఠశాలకు తాళం వేసి వెళ్లి పోయాడు. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ విద్యకు దీటుగా వసతులు కల్పించి, వేలకు వేలు జీతాలు ఇస్తున్నా పలువురు ఉపాధ్యాయులు ప్రభుత్వ లక్ష్యన్ని నీరుగారుస్తున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ విద్యార్థుల పట్ల వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండి పడ్డారు. ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో తెలియదని గ్రామస్థులు తెలిపారు. ఈ విషయంపై ఎంఈఓ చాముండేశ్వరిని వివరణ కోరగా... సంగాల ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు మంగళవారం ఎటువంటి లీవ్ పెట్టలేదన్నారు. తన అనుమతి కూడా తీసుకోలేదని తెలిపారు.