KIOSK: దిష్టిబొమ్మల్లా కియోస్క్ యంత్రాలు
ABN , Publish Date - Nov 12 , 2025 | 12:02 AM
పంటల సాగులో రైతుల సౌలభ్యం కోసం గత వైసీపీ ప్రభుత్వం అప్పటి రైతు భరోసా కేం ద్రాలలో(రైతు సేవా కేంద్రాలు) కియోస్క్ యంత్రాలను ఏర్పాటు చేసింది. ప్రతి రైతు భరోసా కేంద్రంలో ఒకటి చొప్పున ఏర్పాటు చేసింది. తద్వారా రైతులకు అవసరమైన ఎరువులు, మందుల నిలువ తెలుసుకోవడంతో పాటు సాగుకు అవసరమైన అంశాలను అందులో పొందుపరిచేందుకు అవకాశం కల్పించింది.
ఓబుళదేవరచెరువు, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): పంటల సాగులో రైతుల సౌలభ్యం కోసం గత వైసీపీ ప్రభుత్వం అప్పటి రైతు భరోసా కేం ద్రాలలో(రైతు సేవా కేంద్రాలు) కియోస్క్ యంత్రాలను ఏర్పాటు చేసింది. ప్రతి రైతు భరోసా కేంద్రంలో ఒకటి చొప్పున ఏర్పాటు చేసింది. తద్వారా రైతులకు అవసరమైన ఎరువులు, మందుల నిలువ తెలుసుకోవడంతో పాటు సాగుకు అవసరమైన అంశాలను అందులో పొందుపరిచేందుకు అవకాశం కల్పించింది. అయితే గత ప్రభుత్వం నామమాత్రంగా వీటిని ఏర్పాటు చేసిందే తప్ప పూర్తి స్థాయిలో ఆచరణలోకి తీసుకురాలేదు. తద్వారా లక్షలాది రూపా యల ప్రజాధనం వృథా అయిందే తప్పా ఓరిగిందేమి లేదని పలువురు రైతులు విమర్శిస్తున్నారు.
మండల వ్యా ప్తంగా 12 ఆర్‌బీ కేంద్రాలలో 12 కియాస్క్ యంత్రాలను అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని వ్యవసాయ శాఖ అధికారి పేర్కొంటున్నా రు. ఆ యంత్రాలను ఎందుకూ ఉపయోగించుకోకపోవడంతో ఆయా కేంద్రాలలో దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్నాయి.
ప్రచారం కొండంత.... అచరణలో గోరంత
కియోస్క్ యంత్రాల ద్వారా రైతులకు సౌకర్యం కల్పిస్తామని అ ప్పట్లో వైసీపీ ప్రభుత్వం పేర్కొంది. అయితే ఆచరణలో మాత్రం గో రంతగా వ్యవహరించిందని పలు వురు విమర్శిస్తు న్నారు. కనీసం కియోస్క్ యంత్రాలు ఎందుకు ఉపయోగపడతాయి, వాటి వల్ల ప్రయోజనం ఏమి అన్న విషయం ఇప్పటికీ చాలా మంది రైతులకు తెలియదు. దిష్టిబొమ్మ ల్లా ఉన్న ఆ యంత్రాలను కూటమి ప్రభుత్వమైనా ఉపయోగంలోకి తీసు కొచ్చి ప్రజాధనం వృథా కాకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.