APM: పొదుపు సంఘాలను బలోపేతం చేయాలి
ABN , Publish Date - Dec 03 , 2025 | 12:07 AM
పొదుపు సంఘాలను బలోపేతం చేయాలని ఏపీఎం సూర్యనారాయణ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో ప్రగతి మండల పరస్పర సహాయ సహకార సంఘం 28వ వార్షిక మహాసభలను మంగళ వారం ఘనంగా నిర్వహించారు. మండల సమాఖ్య వార్షిక మహాసభ కార్యక్రమంలో భాగంగా 2024-25 నివేదిక, లావాదేవీల ఆడిట్, చేపట్టిన పనుల వివరాలు వివరించారు.
గాండ్లపెంట, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): పొదుపు సంఘాలను బలోపేతం చేయాలని ఏపీఎం సూర్యనారాయణ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో ప్రగతి మండల పరస్పర సహాయ సహకార సంఘం 28వ వార్షిక మహాసభలను మంగళ వారం ఘనంగా నిర్వహించారు. మండల సమాఖ్య వార్షిక మహాసభ కార్యక్రమంలో భాగంగా 2024-25 నివేదిక, లావాదేవీల ఆడిట్, చేపట్టిన పనుల వివరాలు వివరించారు. 2025- 26 సంవత్సరంలో చేపట్టబోవు కార్యచరణ ప్రణాళికపై సభ్యులతో చర్చించారు. అలాగే నూతన పాలకవర్గాన్ని ఎంపిక చేశారు. సమాఖ్య అధ్యక్షురాలిగా శైలజ, కార్యదర్శిగా మౌనిక, కోశాఽధికారిగా ఈశ్వరమ్మ, ఉపాధ్యక్షురాలిగా సుజాతను ఏకగ్రీవంగా ఎం పిక చేశారు. ఈ సందర్భంగా ఏపీఎం మాట్లాడుతూ.. పొదుపు సంఘా లు బలోపేతం చేయాలని, ఆర్థికంగా వెనుకబడిన వారికి మహిళా సంఘం ద్వారా రుణాలు అందించి వారి అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు రాజేశ్వరి, కార్యదర్శి రాములమ్మ, సీసీలు షాకీర్, ప్రసాద్, నిర్మలమ్మ, రఘునాథరెడ్డి, వీవోలు, వీవో లీడర్లు, వీఓఏలు, వీఓఏ లీడర్లు పాల్గొన్నారు.