SAND: ఇష్టారాజ్యంగాఇసుక అక్రమ రవాణా
ABN , Publish Date - Sep 03 , 2025 | 12:00 AM
జిల్లాకేంద్రంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. టీడీపీ, వైసీపీ నాయకులు కు మ్మక్కై మరీ చిత్రావతి నదిని గుల్ల చేస్తున్నారనే ఆరోపణలు వినవస్తు న్నాయి. పట్టణంలోని చిత్రావతినదిలో రాత్రింబగళ్లు ఎక్స్‌కవేటర్లను పెట్టి మరీ ట్రాక్టర్లకు లోడ్ చేసి ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నారు. ప్రభు త్వం పేదలకు ఉచిత ఇసుక విధానం ప్రవేశపెట్టింది.
జిల్లాకేంద్రంలో ఎక్కడా చూసినా ఇసుక డంపులే
పుట్టపర్తి రూరల్, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): జిల్లాకేంద్రంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. టీడీపీ, వైసీపీ నాయకులు కు మ్మక్కై మరీ చిత్రావతి నదిని గుల్ల చేస్తున్నారనే ఆరోపణలు వినవస్తు న్నాయి. పట్టణంలోని చిత్రావతినదిలో రాత్రింబగళ్లు ఎక్స్‌కవేటర్లను పెట్టి మరీ ట్రాక్టర్లకు లోడ్ చేసి ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నారు. ప్రభు త్వం పేదలకు ఉచిత ఇసుక విధానం ప్రవేశపెట్టింది. అయినా సామాన్యులు ఇసుక కావాలంటే మాత్రం వారి వద్ద నుంచి కొనుగోలు చేయాల్సిందే. ఉచిత ఇసుక విధానం ప్రవేశపెట్టిన కూటమి ప్రభుత్వం పక్కాగా ఇసుకను రవాణా చేసే వాహనాలకు జీపీఎస్ సిస్టం ఏర్పాటు చేసింది. లోడింగ్, అనలోడింగ్ ప్రాంతాలను మానిటర్ చేయాలని చెబుతు న్నా ఆ దిశగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు ఏమా త్రం కనిపించడం లేదు. దీంతో ఆధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ నాయకులు కమ్మక్కై ఇసుకను నది నుంచి లూటీ చేస్తున్నా పట్టించుకునే నాథులే కరవయ్యారు. పట్టణంలో పలుచోట్ల ఇసుక డంపులు ఏర్పాటుచేసి అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే చిత్రావతి నది ఎక్కడ చూసినా పెద్దపెద్ద గుంతలతో నిండిపోయింది. ఇప్పటికైనా సంబం ధిత రెవెన్యూ, పోలీసు అధికా రులు ఈ అక్రమ రవాణా ను అడ్డుకుని పద్ధతి ప్రకా రం ఇసుక రవాణా చేస్తే బాగుంటుందని లేక పోతే భవిష్యత్తులో ఈ ప్రాంత వాసులకు ఇసుక కావాలసి వస్తే ఇతర ప్రాంతా లకు వెళ్లి తెచ్చుకోవాల్సి ఉం టుందని ప్రాంతవాసులు వాపోతున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....