GOD: సాయి బోధనలే శిరోధార్యం
ABN , Publish Date - Dec 05 , 2025 | 12:23 AM
సత్యసాయిబాబా ఆధ్యాత్మిక బోధనలు శీరోధార్యమంటూ శ్రీసత్యసాయి గ్లోబల్ కౌన్సిల్ సింగపూర్ ప్రతినిధి విలియం పేర్కొన్నారు. గురువారం రాత్రి ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత సభామండపంలో సింగపూర్ భక్తులు సంగీత కచేరి నిర్వహించారు.
శ్రీసత్యసాయి గ్లోబల్ కౌన్సిల్ సింగపూర్ ప్రతినిధి విలియం
అరించిన సంగీత కచేరి
పుట్టపర్తి, డిసెంబరు4(ఆంధ్రజ్యోతి): సత్యసాయిబాబా ఆధ్యాత్మిక బోధనలు శీరోధార్యమంటూ శ్రీసత్యసాయి గ్లోబల్ కౌన్సిల్ సింగపూర్ ప్రతినిధి విలియం పేర్కొన్నారు. గురువారం రాత్రి ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత సభామండపంలో సింగపూర్ భక్తులు సంగీత కచేరి నిర్వహించారు. మెదటన విలియం ప్రసంగిస్తూ.. ప్రశాంతి నిలయం ప్రపంచశాంతికి మూల కేంద్రమన్నారు. సత్యసాయి చూపిన సేవా మార్గంలో సేవాకార్యక్రమాలు కొనసాగిస్తున్నామన్నారు. అనంతరం రవీం ద్ర పడుచూర్ బృదం కచేరి నిర్వహించారు. భక్తిపాటలతో మైమర పింప జేశారు. అనంతరం వారు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.