Share News

ACCIDENT: ఆర్టీసీ బస్సు, బొలేరో వాహనం ఢీ

ABN , Publish Date - Nov 23 , 2025 | 12:22 AM

మండల పరిధిలోని చిల్లకొండయ్యపల్లి వద్ద ఆర్టీసీ బస్సు, బొలేరో వాహనం ఆదివా రం ఢీకొన్నాయి. అయితే ఎవరికీ ఎటువంటి అపాయం కలుగ లేదు. అనంతపురం నుంచి కడపకు వెళ్తున్న పులివెందుల డిపో కు చెందిన ఆర్టీసీ బస్సు, పార్నపల్లి నుంచి బత్తలపల్లి వైపు వె ళ్తున్న బొలేరోవాహనం చిల్లకొండయ్యపల్లి సమీపంలోని పులి వెందుల బ్రాంచ కెనాల్‌ వద్ద ఢీకొన్నాయి.

ACCIDENT: ఆర్టీసీ బస్సు, బొలేరో వాహనం ఢీ
Damaged Bolero vehicle

స్పల్పగాయాలతో బయటపడ్డ ప్రయాణికులు

తాడిమర్రి, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని చిల్లకొండయ్యపల్లి వద్ద ఆర్టీసీ బస్సు, బొలేరో వాహనం ఆదివా రం ఢీకొన్నాయి. అయితే ఎవరికీ ఎటువంటి అపాయం కలుగ లేదు. అనంతపురం నుంచి కడపకు వెళ్తున్న పులివెందుల డిపో కు చెందిన ఆర్టీసీ బస్సు, పార్నపల్లి నుంచి బత్తలపల్లి వైపు వె ళ్తున్న బొలేరోవాహనం చిల్లకొండయ్యపల్లి సమీపంలోని పులి వెందుల బ్రాంచ కెనాల్‌ వద్ద ఢీకొన్నాయి. బొలేరో వాహనం, బస్సు ముందర భాగాలు దెబ్బతిన్నాయి. ప్రయాణికులు స్వ ల్పగాయాలతో బయటపడ్డారు. పెద్ద ప్రమా దం నుంచి బయ టపడ్డామని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. తాడిమర్రి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Updated Date - Nov 23 , 2025 | 12:22 AM