ROAD: రోడ్లకు అడ్డంగా బండలు, స్తంభాలు
ABN , Publish Date - Sep 06 , 2025 | 11:51 PM
పట్టణంలోని 25వ వార్డు పరిధి లోని ప్రియాంకనగర్‌లో పలు సమస్యలు తిష్టవేశాయి. ప్రధానంగా సీసీ రోడ్లు, డ్రైనేజీ, లో ఓల్టేజ్‌సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. అదేవిధంగా రోడ్డుకు అడ్డంగా పెద్దపెద్ద బండలు, రోడ్డు మధ్యలో విద్యుతస్తంభాలు ఉన్నాయి. ఆ బండలను, విద్యుతస్తంభాలను తొలగిస్తే రోడ్లు వేస్తామని మున్సిపల్ అధికారులు చెబు తున్నారు.
లోఓల్టేజీతో కాలిపోతున్న విద్యుత పరికరాలు
డ్రైనేజీ కాలువలు లేక రోడ్డుపైనే మురుగునీరు
పలు సమస్యల్లో ప్రియాంకనగర్ వాసులు
ధర్మవరం, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని 25వ వార్డు పరిధి లోని ప్రియాంకనగర్‌లో పలు సమస్యలు తిష్టవేశాయి. ప్రధానంగా సీసీ రోడ్లు, డ్రైనేజీ, లో ఓల్టేజ్‌సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. అదేవిధంగా రోడ్డుకు అడ్డంగా పెద్దపెద్ద బండలు, రోడ్డు మధ్యలో విద్యుతస్తంభాలు ఉన్నాయి. ఆ బండలను, విద్యుతస్తంభాలను తొలగిస్తే రోడ్లు వేస్తామని మున్సిపల్ అధికారులు చెబు తున్నారు. వాటిని పక్కకు మార్చాలని సంబంధిత అఽధికారులకు ఎన్ని సార్లు విన్నవించి నా పట్టించుకోవడంలేదని స్థానికులు వాపోతున్నారు. అంతేకాకుండా కొన్ని ఇళ్ల పై విద్యుత లైనలు వెళ్తున్నాయని వాటిని కూడా పక్కకు మార్చాలని చెబు తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోలేదని మండిపడుతున్నారు.
అదేవిధంగా కొన్ని వీధులలో ఇనుప విద్యుతస్తంభాలు ఉన్నాయని, వర్షాకా లంలో వాటికి విద్యుత సరఫరా అవుతోం దని అంటున్నారు. దీని వల్ల ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయాందోళ వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా లో ఓల్టేజ్ సమస్య తీవ్రంగా ఉందని, ఈ వార్డుకు నీరు సరఫరా చేసినప్పుడు అందరూ మోటార్లు వేస్తే కనీసం కొళాయిలకు నీరు ఎక్కడం లేదన్నారు. లోఓల్టేజ్ సమస్యతో టీవీలు, ఫ్రిడ్జ్‌లు, మిక్సీలు, వాషింగ్‌మిషనలు కాలిపోతు న్నాయని మహిళలు వాపోయారు. డ్రైనేజీ కాలువలు లేకపోవడంతో ఇళ్లలోని మురుగు నీటిని రోడ్లపైకి పారవేస్తు న్నారని, దీంతో మహిళలు గొడవలకు దిగుతున్నారన్నారు. ఈ సమస్యలపై ‘మీ సమస్య-మా బాధ్యత’ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాలశ్రీరామ్ దృష్టికి అర్జీల రూపంలో తెలిపామంటున్నారు. స్పందించిన ఆయన సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు తెలియజేశారని చెబుతున్నారు. మున్సిపల్, విద్యుత శాఖ అధికారులు స్పందించి వెంటనే సమస్యలను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
సమస్యలను పరిష్కరిస్తాం- వీరేశకుమార్, డీఈ, మున్సిపాలిటీ
మున్సిపాలిటీకి వచ్చిన డీఎల్‌ఆర్‌ఎస్, 15వ ఆర్థికసంఘం, ఎల్‌ఆర్‌ఎస్ కింద వచ్చిన నిధులన్నీ వైఎస్సార్ కాలనీ, కేతిరెడ్డి కాలనీ, ఇందిరమ్మకాలనీ, దుర్గానగర్ లో మౌలిక వసతులకోసం వెచ్చిస్తున్నాం. ప్రియాంకనగర్‌లో కేవలం కొత్తవీధిలైట్లు వేయిస్తున్నాం. నిధులు రాగానే ప్రియాంకనగర్‌కు మొదటి ప్రాధాన్యం ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....