ROAD: శ్రమదానంతో రోడ్డు నిర్మాణం
ABN , Publish Date - Nov 01 , 2025 | 12:38 AM
ఎవరో వస్తా రనీ... ఏదో చేస్తారనీ ఎదురు చూడకుండా మండలం లోని నడిమికుంటపల్లి, రత్నగిరి, సుబ్బరాయనిపల్లి ప్రజలు ఒక్కటయ్యారు. మూడు గ్రామా లలో గ్రామపెద్దల సమక్షంలో సమావేశమై ప్రతి ఇంటి నుంచి ఒక మనిషి, కొంత విరా ళం వచ్చేలా తీర్మానించారు. మూడు గ్రా మాలలో కలిపి రూ. లక్ష సేకరించారు. ఇంటికి ఒకరు చొప్పున కలిసి, ఎక్స్‌కవేటర్, ట్రాక్టర్‌లు అద్దెకు తీసుకున్నారు.
తనకల్లు, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): ఎవరో వస్తా రనీ... ఏదో చేస్తారనీ ఎదురు చూడకుండా మండలం లోని నడిమికుంటపల్లి, రత్నగిరి, సుబ్బరాయనిపల్లి ప్రజలు ఒక్కటయ్యారు. మూడు గ్రామా లలో గ్రామపెద్దల సమక్షంలో సమావేశమై ప్రతి ఇంటి నుంచి ఒక మనిషి, కొంత విరా ళం వచ్చేలా తీర్మానించారు. మూడు గ్రా మాలలో కలిపి రూ. లక్ష సేకరించారు. ఇంటికి ఒకరు చొప్పున కలిసి, ఎక్స్‌కవేటర్, ట్రాక్టర్‌లు అద్దెకు తీసుకున్నారు. నడవడానికి కూడా వీలుకాని రహదారికి శుక్రవారం మట్టిని తోలి బాగుచేసుకున్నారు. తమ రోడ్డును బాగు చేయాలని ఎన్ని మార్లు అధి కారులకు వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకో లేదన్నారు. దీంతో శ్రమదానం, విరాళాలతో నడిమికుంటపల్లి వద్ద నుంచి కర్ణాటక సరిహద్దు వరకు రహదారి నిర్మించుకు న్నామని వారు అందరికీ చూపించారు. దీంతో మూడు గ్రామాల ప్రజలు మరెందరికో మార్గదర్శకమని పలువురు అభిప్రాయపడ్డారు.