Share News

RETIRED: విశ్రాంతి ఉద్యోగులకు సన్మానం

ABN , Publish Date - Dec 18 , 2025 | 12:21 AM

విశ్రాంత ఉద్యోగుల దినో త్సవం సందర్భంగా 75 సంవత్సరాలు నిండిన 12 మంది విశ్రాంత ఉద్యోగులను బుధవారం ఘనంగా సన్మానించినట్టు జిల్లా పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు రామకృష్ణయ్య తెలిపారు. మండల కేంద్రంలోని పెన్షనర్ల భవనంలో బుధవారం జాతీయ విశ్రాంతి ఉద్యోగుల దినోత్స వాన్ని నిర్వహించారు.

RETIRED: విశ్రాంతి ఉద్యోగులకు సన్మానం
A scene honoring retired workers at the new pond

కొత్తచెరువు, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): విశ్రాంత ఉద్యోగుల దినో త్సవం సందర్భంగా 75 సంవత్సరాలు నిండిన 12 మంది విశ్రాంత ఉద్యోగులను బుధవారం ఘనంగా సన్మానించినట్టు జిల్లా పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు రామకృష్ణయ్య తెలిపారు. మండల కేంద్రంలోని పెన్షనర్ల భవనంలో బుధవారం జాతీయ విశ్రాంతి ఉద్యోగుల దినోత్స వాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పెన్షనర్లకు ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు, ప్రభుత్వం అందిస్తున్న సేవలు తదితర విషయాలను వివరించారు. అదేవిధంగా ట్రెజరీ అధికారి వకుళాదేవి, యూనియన బ్యాంకు మేనేజర్‌ విజయ్‌ శేఖర్‌ను కూడా సన్మానించినట్లు ఆయన తెలిపారు.


విశ్రాంతి ఉద్యో గుల సంఘం ప్రతినిధులు నాగార్జునశెట్టి, ప్రధాన కార్యదర్శి ఆర్‌ ఆంజనేయులు, కోశాధికారి రామప్ప, కార్యదర్శి నాగప్ప, మాజీ జడ్పీటీసీ గఫార్‌, రామాంజినేయులు, విశ్రాంత ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ధర్మవరం: విశ్రాంతి ఉద్యోగుల సేవలు అమూల్యమైనవి బీజేపీ నియోజకవర్గ ఇనచార్జ్‌ హరీశబాబు తెలిపారు. విశ్రాంతి ఉద్యోగుల దినో త్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ఎన్జీఓహోంలో బుధవారం సీనియర్‌ విశ్రాంతి ఉద్యోగులను ఘనంగా సన్మానించారు. విశ్రాంతి ఉద్యోగుల సంఘం ధర్మవరం శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి బీజేపీ నియోజకవర్గ ఇనచార్జ్‌ హరీశబాబు హాజరై మాట్లాడారు. వి శ్రాంతి ఉద్యోగులను సన్మానించారు.


కార్యక్రమంలో విశ్రాంతి ఉద్యోగుల సంఘం తాలూకా అధ్యక్షుడు ఏకిల చలపతి తదితరులు పాల్గొన్నారు.

కదిరి అర్బన: జాతీయ పెన్షనర్ల దినోత్సవాన్ని బుధవారం కదిరిలో ఘనంగా నిర్వహించారు. రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం కదిరి తాలూకా ఆద్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆర్డీఓ వీవీఎస్‌ శర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేసి, ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం అఽధ్యక్ష కార్యదర్శులు శివారెడ్డి, ఆత్మారెడ్డి, రిటైర్డ్‌ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Dec 18 , 2025 | 12:21 AM