Share News

RDO: భూ సమస్యలను వెంటనే పరిష్కరించండి: ఆర్డీఓ

ABN , Publish Date - Sep 03 , 2025 | 12:20 AM

మండల పరిధిలోని భూ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆర్డీఓ మహేశ అన్నా రు. ఆయన మంగళవారం తాడిమర్రి మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. ముందుగా మర్రిమాకులపల్లి, సీసీరేవు గ్రామా ల్లో పారిశుధ్యం, సీసీరోడ్లు, విద్యుత స్తంభాల ఏర్పాట్లను పరిశీలిం చారు.

RDO: భూ సమస్యలను వెంటనే పరిష్కరించండి: ఆర్డీఓ
RDO Mahesha examining the dotted land

తాడిమర్రి, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని భూ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆర్డీఓ మహేశ అన్నా రు. ఆయన మంగళవారం తాడిమర్రి మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. ముందుగా మర్రిమాకులపల్లి, సీసీరేవు గ్రామా ల్లో పారిశుధ్యం, సీసీరోడ్లు, విద్యుత స్తంభాల ఏర్పాట్లను పరిశీలిం చారు. ఆ తరువాత పెద్దకోట్ల గ్రామంలో చుక్కల భూములకు సం బంధించి సమస్యలో ఉన్న భూములను పరిశీలించారు. వాటిని తక్షణమే పరిష్కరించాలని తహసీల్దార్‌ భాస్కర్‌రెడ్డిని ఆదేశించా రు. ఎంపీడీఓ వెంకటరంగారావు, ఆర్‌డబ్ల్యూ ఎస్‌ అధికారులు, విద్యుత ఏఈ శివన్న, మండల సర్వేయర్‌ నరేశ పాల్గొన్నారు.

Updated Date - Sep 03 , 2025 | 12:20 AM