TDP: యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేస్తాం
ABN , Publish Date - Aug 10 , 2025 | 12:09 AM
మండలంలోని మల్లేపల్లి రోడ్డులో తెగిపోయిన ఈదులవంక కల్వర్టు మరమ్మతు పనులను యుద్ధప్రతిపాదన చేపడుతామని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ తెలిపారు. గురువారం రాత్రి కురిసిన వర్షాలకు ఈ కల్వర్టు తెగిపోవడంతో... 15 గ్రామాలకు రాకపోకలు ఆగిపోయాయి. ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బం దులు పడుతున్న నేపథ్యంలో ఆయన పంచాయతీరాజ్ డీఈ శ్రీరాములు, తహసీల్దార్ నారాయణస్వామితో కలిసి పరిశీలించారు. వెంటనే కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపాలని, తాను కలెక్టర్‌తో మాట్లాడుతానని శ్రీరామ్ అధికారులకు సూచించారు.
టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్
ముదిగుబ్బ, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): మండలంలోని మల్లేపల్లి రోడ్డులో తెగిపోయిన ఈదులవంక కల్వర్టు మరమ్మతు పనులను యుద్ధప్రతిపాదన చేపడుతామని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ తెలిపారు. గురువారం రాత్రి కురిసిన వర్షాలకు ఈ కల్వర్టు తెగిపోవడంతో... 15 గ్రామాలకు రాకపోకలు ఆగిపోయాయి. ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బం దులు పడుతున్న నేపథ్యంలో ఆయన పంచాయతీరాజ్ డీఈ శ్రీరాములు, తహసీల్దార్ నారాయణస్వామితో కలిసి పరిశీలించారు. వెంటనే కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపాలని, తాను కలెక్టర్‌తో మాట్లాడుతానని శ్రీరామ్ అధికారులకు సూచించారు. ప్రస్తుతం కల్వర్టు దెబ్బతినడం వలన 15 గ్రామాల ప్రజలు మలకవేముల క్రాస్ మీదుగా వెళ్లాల్సి వస్తోందన్నారు. మండల కేంద్రానికి రావాలంటే మరో పది కిలోమీటర్లు పెరుగుతం దన్నారు. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో నిర్మించిన ఈ కల్వర్టు 2020లో వచ్చిన తుఫానుతో మద్దిలేరు వాగు ఉప్పొంగి నీటి ఉధృతికి పూర్తిగా కొట్టుకు పోయిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం తాత్కాలికంగా మరమ్మతులు చేసి వదిలేయడం వలన సమస్య వచ్చిందన్నారు. ప్రజల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని త్వరలోనే శాశ్వత పనులు ప్రారంభ మవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రమేష్‌బాబు, కరణం ప్రభాకర్, తుమ్మల మనోహర్, కోట్ల బాబి, కోన రవీంద్ర, వినోద్‌బాబు, గోపాల్‌రెడ్డి, సూర్యశేఖర్‌రాజు, ఆనంద్, చల్లా రమేష్, మల్లెల నారాయణస్వామి, నంద, మీసాలరాజు, ఫిరోజ్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....