WATER: పైపులైనకు మరమ్మతులు చేయండి
ABN , Publish Date - Sep 25 , 2025 | 12:27 AM
మండల పరిధిలోని తిరుమలదేవరపల్లిలో తాగునీటి పైపులైన పగిలిపోయి నీరు వృథా గా రోడ్డుపై పారుతోంది. దాదాపు 20 రోజుల క్రితం ఈ పైపులైన పగిలిపోయిందని గ్రామస్థులు తెలిపారు. దీంతో నీరు ట్యాంకుకు వెళ్లడంలేదని, తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నాని వాపో యారు. నీరంతా రోడ్డుపై నిలబడుతూ మడుగును తలపిస్తోందని అంటున్నారు.
కొత్తచెరువు, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి):మండల పరిధిలోని తిరుమలదేవరపల్లిలో తాగునీటి పైపులైన పగిలిపోయి నీరు వృథా గా రోడ్డుపై పారుతోంది. దాదాపు 20 రోజుల క్రితం ఈ పైపులైన పగిలిపోయిందని గ్రామస్థులు తెలిపారు. దీంతో నీరు ట్యాంకుకు వెళ్లడంలేదని, తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నాని వాపో యారు. నీరంతా రోడ్డుపై నిలబడుతూ మడుగును తలపిస్తోందని అంటున్నారు. దీంతో దోమలు అధికమై గ్రామంలో విషజ్వరాలు ప్రబలుతున్నాయని తెలిపారు. తాగునీటి పైపులైనకు మరమ్మ తులు చేయాలని పంచాయతీ కార్యదర్శికి, సర్పంచకు తెలిపిపా వారు పట్టించుకోలేద న్నారు. ఇప్పటికైనా ఉన్నతాదికారులు స్పందించి గ్రామంలో పగిలిపోయిన తాగునీటి పైపులైనకు మరమ్మతులు చేయించాలని గ్రామస్థులు కోరుతున్నారు.