Share News

CLEAR: రోడ్డుకు అడ్డంగా ఉన్న స్తంభం తొలగింపు

ABN , Publish Date - Sep 09 , 2025 | 11:06 PM

పట్టణం లోని 24వ వార్డులో చాలా ఏళ్లుగా రోడ్డుకు అడ్డంగా ఉన్న విద్యుత స్తంభాన్ని పక్కకు మార్చారు. విద్యుత శాఖ మంత్రి ఆదివారం పట్టణంలోని టీడీపీ ధర్మ వరం పార్టీ కార్యాలయానికి ఆదివారం వచ్చారు. ఆయనకు టీడీపీ 24వ వార్డు నాయకులు... వా ర్డులో ఎన్నో సంవత్సరాలుగా రోడ్డుకు అడ్డంగా వి ద్యుత స్తంభం ఉందని, దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.

CLEAR: రోడ్డుకు అడ్డంగా ఉన్న స్తంభం తొలగింపు
Electricity department officials moving the pole aside

ధర్మవరం, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): పట్టణం లోని 24వ వార్డులో చాలా ఏళ్లుగా రోడ్డుకు అడ్డంగా ఉన్న విద్యుత స్తంభాన్ని పక్కకు మార్చారు. విద్యుత శాఖ మంత్రి ఆదివారం పట్టణంలోని టీడీపీ ధర్మ వరం పార్టీ కార్యాలయానికి ఆదివారం వచ్చారు. ఆయనకు టీడీపీ 24వ వార్డు నాయకులు... వా ర్డులో ఎన్నో సంవత్సరాలుగా రోడ్డుకు అడ్డంగా వి ద్యుత స్తంభం ఉందని, దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఆ స్తంభాన్ని తొలగిం చేలా చూడాలని విన్నవించారు. స్పందించిన మంత్రి రవికుమార్‌, టీడీపీ ధర్మవరం ఇనచార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ సూచనతో విద్యుతశాఖ అధికారులు చర్య లు చేపట్టారు. ఏఈ నాగభూషణ, టీడీపీ నాయ కులు మాధవరెడ్డి, జిలాన, బిల్లేరాజజా, సురేశ దగ్గర ఉండి సిబ్బందితో మంగళవారం రోడ్డుకు అడ్డంగా ఉన్న స్తంభాన్ని తొలగించి పక్కకు మా ర్చారు. దీంతో ప్రజలు మంత్రి, పరిటాలశ్రీరామ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Sep 09 , 2025 | 11:06 PM