MLA: పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు
ABN , Publish Date - Aug 09 , 2025 | 12:35 AM
తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి పని చేసిన కార్యకర్తలకు గుర్తింపు ఉంటుంద ని, ప్రభుత్వ పదవులు లభిస్తాయని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి పేర్కొన్నారు. స్థానిక సొసైటీ కార్యాలయం ఆవరణం లో శుక్రవారం సింగల్ విండో చైర్మనగా గడ్డం రమణారెడ్డి, డైరెక్టర్లుగా గంగుల ప్పనాయుడు, నాగేనాయక్ ప్రమాణం స్వీకారం చేశారు. ముఖ్యఅ తిథులుగా ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి హాజర య్యారు.
ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి
నల్లమాడ, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి పని చేసిన కార్యకర్తలకు గుర్తింపు ఉంటుంద ని, ప్రభుత్వ పదవులు లభిస్తాయని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి పేర్కొన్నారు. స్థానిక సొసైటీ కార్యాలయం ఆవరణం లో శుక్రవారం సింగల్ విండో చైర్మనగా గడ్డం రమణారెడ్డి, డైరెక్టర్లుగా గంగుల ప్పనాయుడు, నాగేనాయక్ ప్రమాణం స్వీకారం చేశారు. ముఖ్యఅ తిథులుగా ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి హాజర య్యారు. అంతకు ముందు ఎమ్మెల్యే, మాజీ మంత్రితో పాటు చైర్మన మం డలకేంద్రంలోని సత్యమ్మ దేవతకు ప్రత్యేక పూజకు పూజలు చేశారు. అనంతరం సహకార బ్యాంక్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రమాణస్వీకారానంతరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి మాట్లాడుతూ టీడీపీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలను ప్రభుత్వం గుర్తింపు ఇస్తుందన్నా రు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన యేడాదిలోనే ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. తాము కోరిన వెంటనే ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు స్పందించి, సత్యసాయిబాబా శతజయంతిని, స్వాతంత్య్ర సమర యోధుడు వడ్డె ఓబన్న జయంతిని రాష్ట్ర పండుగలుగా గుర్తించారన్నారు. బుక్కపట్నం చెరువు కింద ముంపు రైతులకు న్యాయం చేస్తామని సీఎం హామీ ఇచ్చాన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ జెండా రేపరెపలాడాలని అన్నారు. అనంతరం చైర్మన, డైరెక్టర్లను ఎమ్మెల్యే, మాజీ మంత్రి సన్మానించారు. ఈ కార్యక్రమం లో టీడీపీ మండల కన్వీనర్ మైలే శివశంకర్, సర్పంచ భారతి, నాయకులు సామకోటి ఆదినారాయణ, సలాంఖాన, బుట్టి నాగభూషణనాయుడు, కోట్లో మంజునాథ్‌రెడ్డి, కేశవరెడ్డి, కొక్కంటి మంజునాథ్‌రెడ్డి, శివారెడ్డి, అబ్బాస్‌ఖాన తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....