Share News

MLA: కష్టపడిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు

ABN , Publish Date - Nov 12 , 2025 | 12:06 AM

టీడీపీలో కష్టపడిన ప్రతి కార్యకర్త కు గుర్తింపు ఇస్తామని, పదవితో గౌరవిస్తామని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ పేర్కొన్నారు. పట్టణంలోని పీఆర్‌ గ్రాండ్‌లో మంగళవారం నూతనంగా ఎన్నికైన క్లస్టర్‌, యూనిట్‌, బూత కన్వీనర్లతో ప్రమాణస్వీకా రం చేయించారు. ముందుగా టీడీపీ జెండాను ఆవిష్కరించారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళు లు అర్పించి, కేక్‌ కట్‌ చేశారు.

MLA: కష్టపడిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు
MLA Kandikunta Venkataprasad cutting the cake

- టీడీపీ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవంలో ఎమ్మెల్యే కందికుంట

కదిరి, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): టీడీపీలో కష్టపడిన ప్రతి కార్యకర్త కు గుర్తింపు ఇస్తామని, పదవితో గౌరవిస్తామని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ పేర్కొన్నారు. పట్టణంలోని పీఆర్‌ గ్రాండ్‌లో మంగళవారం నూతనంగా ఎన్నికైన క్లస్టర్‌, యూనిట్‌, బూత కన్వీనర్లతో ప్రమాణస్వీకా రం చేయించారు. ముందుగా టీడీపీ జెండాను ఆవిష్కరించారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళు లు అర్పించి, కేక్‌ కట్‌ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇరవై సంవత్సరాలుగా పార్టీకోసం కష్టపడుతున్న ప్రతికార్యకర్తను గుర్తించి, పార్టీ పదవులతో గౌరవిస్తామన్నారు. ఐవీఆర్‌ఎస్‌ సర్వే వల్ల పార్టీలో కొంతమం దికి పదవులు రాకపోయినా, నియోజకవర్గ ఎమ్మెల్యేగా పార్టీకోసం కష్టపడిన వారందరికీ సముచిత స్థానం కల్పిస్తామన్నారు. నియోజకవ ర్గంలో 90వేలకుపైగా సభ్యత్వాలు ఉన్నాయంటే అది కార్యకర్తలందరి కృషే అన్నారు.


అలాగే ఇరవై యేళ్లలో మొట్టమొదటసారిగా తనకు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఇప్పుడు అవకాశం వచ్చిందన్నారు. ఇప్పుడు నియోజకవ ర్గ వ్యాప్తంగా ప్రజలందరూ మనవారే అన్నారు. వారి సమస్యల పరిష్కా రానికి మనం పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు. గతంలో లాగా తమకు సమయం ఇవ్వడంలేదని కొంతమంది కార్యక ర్తలు బాధపడడం లో అర్థం లేదన్నారు. నియోజకవర్గం అభివృద్ధిలో భాగంగా కార్యకర్తలకు తగినంత సమయం ఇవ్వలేకపోతున్నామని ఆయన పేర్కొన్నారు. నియో జకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. కదిరి, ఎన్పీకుంట రోడ్డు పూర్తి చేశామని, తలుపుల మండలంలో చెరువు లకు హంద్రీనీవా నీరు అందించామన్నారు. మైనార్టీ విద్యాసంస్థలకు నిధులు విడుదల చేశామన్నారు. మరెన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ప్రతి కార్యకర్త వారి గ్రామాల్లో ఉండి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. అనంతరం వార్డులు, పంచాయతీల వారీగా నాయకులతో మాట్లాడి, సమస్యలు తెలుసుకున్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గ పరిశీలకులు వహీద్‌హుస్సేన, రాష్ట్ర కార్యని ర్వాహక కార్యదర్శి పీవీ పవనకుమార్‌రెడ్డి, టౌన ప్రెసిండెంట్‌ డైమండ్‌ ఇర్ఫాన, కమ్మకార్పొరేషన డైరెక్టర్‌ మనోహర్‌నాయుడు, అగ్రికల్చర్‌ డైరెక్టర్‌ క్రిష్ణమూర్తితోపాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Nov 12 , 2025 | 12:06 AM