MLA: పిల్లలకు చదువే నిజమైన ఆస్తి
ABN , Publish Date - Dec 06 , 2025 | 12:40 AM
నేటి పిల్లలే రేపటి పౌరులని, పిల్లలకు చదువే నిజమైన ఆస్తి అని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి పేర్కొన్నారు. మునిసిపల్ పరిధిలోని బీడుపల్లి జిల్లా పరిషత ఉన్నతపాఠశాల, అమడగూరు మండలకేంద్రంలోని మోడల్ స్కూల్, జడ్పీ ఉన్నత పాఠశాల, కేజీబీవీలో శుక్రవారం ఏర్పాటుచేసిన మెగా పీటీఎం కార్యక్రమాలకు ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు.
ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి
పుట్టపర్తి రూరల్/ అమడగూరు, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): నేటి పిల్లలే రేపటి పౌరులని, పిల్లలకు చదువే నిజమైన ఆస్తి అని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి పేర్కొన్నారు. మునిసిపల్ పరిధిలోని బీడుపల్లి జిల్లా పరిషత ఉన్నతపాఠశాల, అమడగూరు మండలకేంద్రంలోని మోడల్ స్కూల్, జడ్పీ ఉన్నత పాఠశాల, కేజీబీవీలో శుక్రవారం ఏర్పాటుచేసిన మెగా పీటీఎం కార్యక్రమాలకు ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. ఆయా పాఠశాలల్లో చదువులో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థినీ విద్యార్థులకు ఎమ్మెల్యే, మాజీ మంత్రి చేతులమీదుగా ప్రశంసాపత్రాల ను అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో బీడుపల్లి స్కూల్‌కమిటీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, వైస్‌చైర్మన రాధ, ప్రధానోపాధ్యాయిడు గోపాల్‌నాయక్, తహసీల్దార్ రామనాథ్‌రెడ్డి, ఎంపీడీఓ మునెప్ప, ఈఓఆర్‌డీ రాజశేఖర్, ఎంఈఓలు జిలానబాషా, సంపూర్ణ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమణారెడ్డి, గోపాల్‌నాయక్, కేజీబీవీ ఎస్‌ఓ వెంకటరమణమ్మ, టీడీపీ మండల కన్వీనర్ గోపాల్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర కార్పొరేషన డైరెక్టర్ కాలేనాయక్, సర్పంచ షబ్బీర్, జీసీడీఓ అనిత తదతరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....