TDP: సీఎంకు రమేష్ యాదవ్ క్షమాపణలు చెప్పాలి
ABN , Publish Date - Sep 26 , 2025 | 12:01 AM
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్ వెంటనే క్షమాపణలు చెప్పాలని టీడీపీ నాయకులు డి మాండ్ చేశారు.
పుట్టపర్తిరూరల్, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్ వెంటనే క్షమాపణలు చెప్పాలని టీడీపీ నాయకులు డి మాండ్ చేశారు. పట్టణంలోని హనుమాన కూడలిలో గురువారం టీ డీ పీ జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ ఆధ్వర్యంలో నిరసన కా ర్యక్రమం చేపట్టారు. రమేష్‌యాదవ్ చిత్రపటాలను దహనం చేశారు. ఐటీడీపీ నియోజకవర్గ అధ్యక్షుడు జయప్రకాష్, నాయకులు భీమినేని కిష్టప్ప, సాయికుమార్, కార్యకర్తలు నారాయణస్వామి, రమణ, నారాయ ణ, రమణారెడ్డి, రామకృష్ణ, కిష్టయ్య, పోతన్న, గంగాద్రి పాల్గొన్నారు.