RDO: పోరెడ్డివారిపల్లిలో రైతన్నా మీ కోసం
ABN , Publish Date - Nov 27 , 2025 | 12:29 AM
మండల పరిఽఽధిలోని తూ పల్లి పంచాయతీ పోరెడ్డివారిపల్లిలో బుధవారం ‘రైతన్నా మీకోసం’ కార్య క్రమం నిర్వహించారు. ఆర్డీఓ వీవీఎస్ శర్మ పాల్గొని, మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం అన్నదాత సుఖీభవ రెండో విడత రూ. 7వేలు వారి ఖాతాలో జమచేసిందన్నారు. జమ కాని రైతులు వ్యవసాయ కా ర్యాలయంలో అధికారులను సంప్రదించాలని సూచించారు.
గాండ్లపెంట, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): మండల పరిఽఽధిలోని తూ పల్లి పంచాయతీ పోరెడ్డివారిపల్లిలో బుధవారం ‘రైతన్నా మీకోసం’ కార్య క్రమం నిర్వహించారు. ఆర్డీఓ వీవీఎస్ శర్మ పాల్గొని, మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం అన్నదాత సుఖీభవ రెండో విడత రూ. 7వేలు వారి ఖాతాలో జమచేసిందన్నారు. జమ కాని రైతులు వ్యవసాయ కా ర్యాలయంలో అధికారులను సంప్రదించాలని సూచించారు. ఏడీఏ సనా వుల్లా మాట్లాడుతూ రైతులు ఏపీఏఐఎంఎస్ యాప్‌ను ఇనస్టాల్ చేసు కోవాలని తెలిపారు. అన్నదాత సుఖీభవ కరపత్రాలను రైతులకు అంద జేశారు. అనంతరం రాజ్యాంగ దినత్సోవం సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బాబురావు, ఎంపీడీఓ రామకృష్ణ , వ్యవసాయ అధికారి షాదాబ్, వివిధ శాఖల అధికారులు, కూటమి నాయకులు, కిసాన మోర్చా జిల్లా అధ్యక్షుడు కేశవరెడ్డి, నాయకులు సిద్దారెడ్డి, రైతులు గెంగిరెడ్డి, ఓబుళరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....