RDO: ప్రజా పంపిణీని బలోపేతం చేయాలి : ఆర్డీఓ
ABN , Publish Date - Aug 07 , 2025 | 12:34 AM
అధికారులందరూ సమన్వ యంతో పనిచేసి ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాలని ఆర్డీఓ మహేశ పేర్కొన్నారు. ఆయన బుధవారం ధర్మవరం మా ర్కెట్‌యార్డ్‌లో ఉన్న ఎంఎల్‌ఎస్ స్టాక్‌పాయింట్‌ను తనిఖీ చేశారు. గోదాములో ఉన్న నిత్యావసర సరుకులను పరిశీలించారు. స్టాక్ రిజిస్టర్, ఇతర రికార్డులను పరిశీలించి సరుకుల లభ్యత, పంపిణీ వివరాలను క్రాస్ చెక్ చేశారు.
ధర్మవరం, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): అధికారులందరూ సమన్వ యంతో పనిచేసి ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాలని ఆర్డీఓ మహేశ పేర్కొన్నారు. ఆయన బుధవారం ధర్మవరం మా ర్కెట్‌యార్డ్‌లో ఉన్న ఎంఎల్‌ఎస్ స్టాక్‌పాయింట్‌ను తనిఖీ చేశారు. గోదాములో ఉన్న నిత్యావసర సరుకులను పరిశీలించారు. స్టాక్ రిజిస్టర్, ఇతర రికార్డులను పరిశీలించి సరుకుల లభ్యత, పంపిణీ వివరాలను క్రాస్ చెక్ చేశారు. సిబ్బంది పూర్తి నిబద్ధతతో పనిచే యాలని ఆదేశించారు. ప్రజలకు నిత్యావసర సరుకులు సమయా నికి, పారదర్శకంగా అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం వద్దని హె చ్చరించారు. తనిఖీలో గుర్తించిన అంశాలపై తక్షణ చర్యలు తీసుకు ని సర్దుబాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు
ఆధార్‌లింకులో పొరపాట్లను సరిదిద్దండి
ఫ ధర్మవరం రూరల్: ఆధార్‌లింకులో పొరపాట్ల వల్ల అర్హులై న వారికి అన్నదాత సుఖీభవ పథకం వర్తించలేదని తమ దృష్టికి వచ్చిందని, వెంటనే ఆ పొరపాట్లును సరిదిద్దాలని ఆర్డీఓ మహేష్ సచివాలయ సిబ్బందికి సూచించారు. ఆయన బుధవారం మండ లంలోని సీసీకొత్తకోట గ్రామ సచివాలయాన్ని సందర్శించారు. సచివాలయానికి వచ్చిన రైతులతో ఆయన మాట్లాడారు. దీంతో తమ ఖాతాకు వేరేవాళ్ల ఆధార్ మ్యాచింగ్ కావడంతో తమకు అన్నదాత సుఖీభవ పథకం వర్తించలేదని ఆయన దృష్టికి తెచ్చారు. దీంతో ఆయన సిబ్బందితో ఆధార్‌సీడింగ్ సమస్యపై సమీక్ష నిర్వహించారు. దగ్గరుండి రైతులకు ఆధార్‌లింకు చేయించారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....