SUPERINTENDENT : రోగులకు నాణ్యమైన భోజనం అందించాలి
ABN , Publish Date - Apr 11 , 2025 | 12:25 AM
మహాత్మా జ్యోతి బాపూలే 199వ జయంతి వేడుకలను విజయవంతం చేయాలని బీసీ సంక్షేమశాఖ డీడీ కుష్బూకొఠారీ గురువారం ప్రకటనలో కోరారు. శుక్రవారం ఉదయం 9.30 గంటలకు జిల్లా పరిషత ఆవరణంలోని జ్యోతిబాపూలే విగ్రహం వద్ద నివాళులర్పిస్తామన్నారు.

- సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు ఆదేశం
అనంతపురం ప్రెస్‌క్లబ్, ఏప్రిల్ 10(ఆంధ్రజ్యోతి): మహాత్మా జ్యోతి బాపూలే 199వ జయంతి వేడుకలను విజయవంతం చేయాలని బీసీ సంక్షేమశాఖ డీడీ కుష్బూకొఠారీ గురువారం ప్రకటనలో కోరారు. శుక్రవారం ఉదయం 9.30 గంటలకు జిల్లా పరిషత ఆవరణంలోని జ్యోతిబాపూలే విగ్రహం వద్ద నివాళులర్పిస్తామన్నారు. అనంతరం 10 గంటలకు కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనలో ఉత్సవాలు నిర్వహిస్తామ న్నారు. ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ అధ్యక్షతన నిర్వహించే ఈ కార్యక్రమానికి జిల్లా ఇనచార్జ్ మంత్రి టీజీ భరత, రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్, బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత, కలెక్టర్ వినోద్‌కుమార్, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు, ఎంపీలు అంబికా లక్ష్మీనారాయణ, బీకే పార్థసారఽథితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరవుతున్నారన్నారు. కావున జిల్లాలోని ప్రజలు, బీసీ సంఘాల నాయకులు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
నేడు బీసీ సబ్సిడీ రుణాల మెగా చెక్కు విడుదల : ఈడీ
రాష్ట్ర ప్రభుత్వం బీసీ కార్పొరేషన ద్వారా మంజూరు చేసిన సబ్సిడీ రుణాల మెగా చెక్కును శుక్రవారం విడుదల చేస్తున్నట్లు బీసీ కార్పొరేషన ఈడీ సుబ్రహ్మణ్యం తెలిపారు. జిల్లాలో 477 మంది లబ్ధిదారుల సబ్సీడీ రుణాలకు సంబంధించి రూ.11.61 కోట్లు నిధులు విడుదలయ్యాయని తెలిపారు. జ్యోతిబాఫూలే జయంతి వేడుకల సందర్భంగా కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనలో కలెక్టర్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా రూ. 11.61 కోట్ల మెగా చెక్కును విడుదల చేయనున్నట్లు తెలిపారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....