PROTEST: ‘ఉపాధి హామీ’ పేరు మార్పుపై నిరసన
ABN , Publish Date - Dec 20 , 2025 | 11:35 PM
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానిక మ హాత్మాగాంధీ పేరు తొలగిస్తూ వీజీ జీ ఆర్ ఎంఎం జోగు పేరు పెట్టడపై సీపీఎం, రైతుసంఘం నాయకులు మండిపడ్డారు. ఈ మేరకు వారు శనివారం స్థానిక గాంధీ నగర్‌లో మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు.
ధర్మవరం, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానిక మ హాత్మాగాంధీ పేరు తొలగిస్తూ వీజీ జీ ఆర్ ఎంఎం జోగు పేరు పెట్టడపై సీపీఎం, రైతుసంఘం నాయకులు మండిపడ్డారు. ఈ మేరకు వారు శనివారం స్థానిక గాంధీ నగర్‌లో మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. పేదలకు పట్టెడు అ న్నం పెట్టే ఉపాది హామీ పథకాన్ని మోదీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని మండి పడ్డారు. రైతుసంఘం జిల్లా ప్రధాన కార్య దర్శి జంగాలపల్లి పెద్దన్న, సీపీఎం సీనియర్ నాయకులు ఎస్‌హెచ బాషా, సీపీఎంపట్టణ కార్యదర్శి మారుతి, సీఐటీయూ జిల్లా ఉపాధ్య క్షుడు అయూబ్‌ఖాన, మండల అధ్యక్షుడు ఎల్ ఆదినారాయణ, చేనేత నాయకులు ఖాదర్‌బాషా, హరి, నరసింహారెడ్డి, సోతలయ్య పాల్గొన్నా రు. అదేవిధంగా జాతీయ ఉపాది హామీ పథకానికి పేరు మార్పుపై కేం ద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ని యోజకవర్గ నాయకులు తుంపర్తి పరమేశ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.
తనకల్లు: కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును మార్పు చేయడం సరికాదని సీపీఎం, రైతు సంఘం ఆధ్వర్యంలో శనివారం తహసీల్దార్ షాబుద్దీనకు వినతిప త్రం అందజేశారు. దేశంలో ఎన్నో సమస్యలుండగా, పథకాల పేర్లు మార్పు దేనికని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండ ల కా ర్యదర్శి శివన్న, జిల్లా కమిటీ సభ్యులు జగన్మోహన, సీఐటీయూ నాయ కులు వేమన్న, శ్రీనివాసులు, ఆంజనేయులు, కృష్ణానాయక్, ఆదెప్ప, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....