PROTEST: ఓటర్ల తొలగింపుపై నిరసన
ABN , Publish Date - Aug 09 , 2025 | 12:31 AM
బీహార్‌లో తొలగించిన ఓటర్ల జాబితాను సుప్రీం కోర్టుకు సమర్పించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రాంభూపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. బీహార్‌లో జరిగిన ఓటర్ల రద్దును నిరసిస్తూ పట్టణంలోని అంబేడ్కర్ సర్కిల్ వద్ద శుక్రవారం ఆయన ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.
పట్టణంలో నిరసన వ్యక్తం చేస్తున్న సీపీఎం నాయకులు
ధర్మవరం రూరల్, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): బీహార్‌లో తొలగించిన ఓటర్ల జాబితాను సుప్రీం కోర్టుకు సమర్పించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రాంభూపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. బీహార్‌లో జరిగిన ఓటర్ల రద్దును నిరసిస్తూ పట్టణంలోని అంబేడ్కర్ సర్కిల్ వద్ద శుక్రవారం ఆయన ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ బీహార్ రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఎన్నికల సందర్భంగా దాదాపు 80లక్షల మంది ఓట్లను గ ల్లంతుచేశారి, వారిలో ఎక్కువమంది బడుగు బలహీన బీసీ వర్గాల ప్ర జలు, మైనారిటీలు వలస వెళ్లిన వారు ఉన్నారన్నారు. ఎన్డీయే కూటమికి వ్యతిరేకంగా ఓట్లు నమోదు అవుతాయనే అనుమానంతో అర్హులైన ఓటర్లను జాబితాలో నుంచి తీసివేశారని విమర్శించారు. ఆ విధంగా తొలిగించిన ఓటర్ల లిస్టును సుప్రీంకోర్టుకు అందచేయాలని ఆదేశాలున్నా ఇప్పటికీ సంబంధిత అదికారులు స్పందింలేదన్నారు. పైగా సమయం సరిపోదని తెలపడం వెనుక పూర్తిగా అదికార పార్టీ హస్తం ఉందని ఆరోపించారు. ఇటువంటి విధానాలను ఎన్డీయే కూటమి ప్రభుత్వం మా నుకోవాలని సీపీఎం నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీ ఎం జిల్లా నాయకులు జంగాలపల్లి పెద్దన్న, ఈఎస్ వెంకటేశు, జడ్‌పీ శ్రీనివాసులు, దిల్షాద్, లక్ష్మీనారాయణ, సీపీఎం నాయకులు మారుతి, రమణ ఆదినారాయణ, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.