MLA: లాభసాటి వ్యవసాయమే ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Dec 04 , 2025 | 12:13 AM
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే పల్లె సిందూర రెడ్డి పేర్కొన్నారు. మండలకేంద్రంలో బుధవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతన్నా... మీకోసం కార్యక్రమానికి ఎమ్మెల్యేతో పాటు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నికలముందు రైతులకిచ్చిన హామీ మేరకు పలు పథకాలు అమలు చేస్తోందన్నారు.
ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, కలెక్టర్ శ్యాంప్రసాద్
నల్లమాడ, డిసెంబరు3 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే పల్లె సిందూర రెడ్డి పేర్కొన్నారు. మండలకేంద్రంలో బుధవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతన్నా... మీకోసం కార్యక్రమానికి ఎమ్మెల్యేతో పాటు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నికలముందు రైతులకిచ్చిన హామీ మేరకు పలు పథకాలు అమలు చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలన్న ఉద్దేశ్యంతో పంచసూత్రాలను తీసుకొచ్చారని, రైతును రాజు చేయాలన్నదే ఆయన లక్ష్యమన్నారు.
కలెక్టర్ మాట్లాడుతూ... వ్యవసాయాన్ని పండు గ చేయాలన్న ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం రైతన్న మీకోసం చేపట్టి, పంచసూత్రాలు అమలు చేస్తోందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ సహకరాంతో పీఎం ధనధాన్యయోజన పథకం తీసుకొచ్చి ఆఽధునిక సాంకేతిక పద్ధతులతో మేలైన దిగుబడులు సాధించడానికి రైతులకు శిక్షణిస్తోందన్నారు. రైతు సమస్యలపై అద్భుతంగా మాట్లాడిన దొన్నికోటకు చెందిన కేశవరెడ్డి, మహిళ రైతు వనజను ఎమ్మెల్యే, కలెక్టర్ అభినందించారు. ఈకార్యక్రమంలో ఇరిగేషన కార్పొరేషన రాష్ట్ర డైరెక్టర్ పత్తి చంద్రశేఖర్, మార్కెట్‌యార్డు చైర్మన పూల శివప్రసాద్, సర్పంచ భారతి, సింగల్‌విండో అధ్యక్షుడు రమణారెడ్డి, టీడీపీ మండల కన్వీనర్ మైలే శివశంకర్, కూటమి నాయకులు ఎల్‌ఐసీ నరసింహులు, శరతకుమార్‌రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి రామునాయక్, జిల్లా పశుసంవర్ధకాధికారి శుభదాస్, ఉద్యాన శాఖాధికారి చంద్రశేఖర్, ఏపీఎంఐపీ అధికారి సుదర్శన, తహసీల్దార్ మనోజ్‌కుమార్, ఎంపీడీఓ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....