GOD: భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణుడి ఊరేగింపు
ABN , Publish Date - Aug 21 , 2025 | 12:04 AM
మండల కేంద్రంలో ప్రబోధానంద సేవా సమితి, త్రైత సిద్ధాంతం సభ్యుల ఆఽధ్వర్యం శ్రీకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక బస్ షెల్టర్‌లో శ్రీకృ ష్ణాష్టమి సందర్భంగా ఈ నెల 16న కృష్ణుడి ప్రతిమను ఏర్పాటు చేసి నాలుగు రోజులు ప్రత్యేక పూజలు చేశారు. ఐదో రోజు బుధ వారం శ్రీకృష్ణుడి ప్రతిమను పల్లకిలో ఉంచి గ్రామోత్సవం నిర్వ హించారు.
ముదిగుబ్బ/ బత్తలపల్లి, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో ప్రబోధానంద సేవా సమితి, త్రైత సిద్ధాంతం సభ్యుల ఆఽధ్వర్యం శ్రీకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక బస్ షెల్టర్‌లో శ్రీకృ ష్ణాష్టమి సందర్భంగా ఈ నెల 16న కృష్ణుడి ప్రతిమను ఏర్పాటు చేసి నాలుగు రోజులు ప్రత్యేక పూజలు చేశారు. ఐదో రోజు బుధ వారం శ్రీకృష్ణుడి ప్రతిమను పల్లకిలో ఉంచి గ్రామోత్సవం నిర్వ హించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తహసీల్దార్ నారాయణ స్వామి, ముదిగుబ్బ సీఐ శివరాముడు, రూరల్ సీఐ శ్యామరావు హాజరయ్యారు. పల్లకిని ఎత్తుకొని ఊరేగింపు ప్రారంభించారు. కృష్ణుడి వేషధారణలో చిన్నారులు అలరించారు. అలాగే ప్రబోధసేవా సమితి, ఇందూ జ్ఞాన వేదిక ఆధ్వర్యంలో బత్తలపల్లి ఏర్పాటు చేసిన శ్రీకృష్ణుడి ప్రతిమను బుధవారం మండలకేంద్రంలో ఘనంగా ఊరేగించారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....