PM: ప్రధాని పర్యటన ఏర్పాట్ల పరిశీలన
ABN , Publish Date - Nov 17 , 2025 | 12:16 AM
సత్యసాయిబాబా శతజయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 19న పుట్టపర్తికి రానున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లను ముమ్మ రం చేశారు. ఆదివారం రాత్రి రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ కమిషనర్ ప్రధానమంత్రి పర్యటన ఏర్పాట్ల సమన్వయ అధికారి వీరపాండ్యన పుట్టపర్తికి చేరుకున్నారు.
పుట్టపర్తి టౌన, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): సత్యసాయిబాబా శతజయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 19న పుట్టపర్తికి రానున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లను ముమ్మ రం చేశారు. ఆదివారం రాత్రి రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ కమిషనర్ ప్రధానమంత్రి పర్యటన ఏర్పాట్ల సమన్వయ అధికారి వీరపాండ్యన పుట్టపర్తికి చేరుకున్నారు. మొదట కలెక్టరేట్‌లో కలెక్టర్ శ్యాంప్రసాద్, జేసీ మౌర్య భరద్వాజ్‌తో కలిసి ప్రధాని రాక సందర్భంగా తీసుకో వాల్సిన జాగ్రత్తలు, ఏర్పాట్ల గురించి చర్చించారు. అనంతరం విమా నాశ్రయం వద్ద తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచన లు చేశారు. అక్కడి నుంచి ప్రశాంతి నిలయం చేరుకుని సాయికు ల్వంత హాలులో సత్యసాయిబాబా మహాసమాధిని దర్శించుకున్నారు. అనంతరం ప్రధాని పర్యటించే ప్రదేశాలను పరిశీలించారు. హిల్‌వ్యూ స్టేడియంలో జరిగే ప్రధాని బహిరంగసభ ఏర్పాట్లను పరిశీలించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు పలు సూచనలు చేశారు.