SEED: ప్రత్నామ్నాయ విత్తన పంపిణీ ఎప్పుడో..?
ABN , Publish Date - Nov 30 , 2025 | 11:43 PM
రబీ సీజన వచ్చే సింది. సాగుకు వేళ అయింది. ఇటీవల కురిసిన వర్షాలకు ప్రభుత్వం ప్ర త్నామ్నాయ విత్తసాగు కోసం విత్తన ఉలవలను రాయితీతో మండలాని సరఫరా చేసింది. ఈ వర్షాలకు విత్తనాలను విత్తేందుకు రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రభుత్వం పంపీణీ చేసిన విత్తనాలను ఇప్పటివరకు ఒకటి రెండు గ్రామాల్లో తప్ప ఏ గ్రామంలోనూ పంపిణీ చేయలేదు
మండలానికి ప్రభుత్వం
400క్వింటాళ్లు సరఫరా
రబీసాగుకు అదును
దాటి పోతున్నా పంపిణీ
చేయలేదంటున్న రైతులు
ధర్మవరం రూరల్, నవంబరు30(ఆంధ్రజ్యోతి): రబీ సీజన వచ్చే సింది. సాగుకు వేళ అయింది. ఇటీవల కురిసిన వర్షాలకు ప్రభుత్వం ప్ర త్నామ్నాయ విత్తసాగు కోసం విత్తన ఉలవలను రాయితీతో మండలాని సరఫరా చేసింది. ఈ వర్షాలకు విత్తనాలను విత్తేందుకు రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రభుత్వం పంపీణీ చేసిన విత్తనాలను ఇప్పటివరకు ఒకటి రెండు గ్రామాల్లో మినగా ఏ గ్రామంలోనూ పంపిణీ చేయలేదు. ప్రభుత్వం మండలానికి 400 క్వింటాళ్లు ఉలవ విత్తనాలను కేటాయించి సరఫరా చేసినట్లు వ్యవసాయాధికారి తెలిపా రు. వాటిని ఆయా గ్రామాల రైతుసేవా కేంద్రాలకు తరలించారు. ఇప్పటివరకు వాటిని రైతులకు పంపిణీ చేయలేదు. రబీసాగు అదునుదాటిపోతుండడంతో రైతులు పట్టణాలకు వెళ్లి కోనుగోలు చేసి తెచ్చుకుని సాగుచేసుకుంటున్నారు. రైతులు రైతు సేవాకేంద్రాలకు వెళ్లి అడిగితే సిబ్బంది రైతన్నా మీకోసం కార్యక్రమం సాకుచూపుతున్నారని ఆయా గ్రామాల రైతులు వాపోతున్నారు. కొన్ని గ్రామాల్లో రైతన్నా మీకోసం కార్యక్రమాన్ని కూడా నిర్వహించలేదని అయినా విత్తనాలు పంపిణీ చేయ కుండా రైతుసేవాకేంద్ర సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రభుత్వం విత్తనాలు సరఫరా చేస్తే మీరెందుకు ఇంకా ఇవ్వరు అంటూ పలు గ్రామాల్లో రైతు సేవా కేంద్రాల సిబ్బందిని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే రబీసాగు అదును దాటిపోతుండడంతో... విత్తనాలు ఇంకెప్పుడు పంపిణీ చేస్తారని పలువురు రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా మండల వ్యవసాయాధికారులు స్పందిం చి ప్రత్నామాయ సాగు కోసం ఉలవ విత్తనాలు పంపిణీ చేయాలని పలు గ్రా మాల రైతులు కోరుతున్నారు.
అందరికీ పంపిణీ చేస్తాం- ముస్తఫా, ఏఓ, ధర్మవరం
రబీ సీజనలో ప్రత్యామ్నాయ సాగు కోసం ప్రభుత్వం ఉలవల విత్తనాలను సరఫరా చేసింది. వాటిని రైతులకు పంపీణీ చేయాలని ఇప్పటికే ఆయా రైతుసేవాకేంద్రాల సిబ్బందికి తెలియజేశాం. రబీలో సాగుచేసే రైతులకు మాత్రమే విత్తనాలను సరఫరా చేస్తాం. ఇప్పటికే మండలంలోని కొన్ని పంచాయతీలలో పంపీణీ చేశాం. మిగతా పంచాయతీలలో కూడా పంపిణీ చేస్తాం.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....